పంత్ ను మళ్ళీ కెలికిన ఊర్వశి, ఆర్సీబీ తన ఫేవరెట్ అంటూ కామెంట్
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ను బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై కామెంట్స్ చేసి..

లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ను బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై కామెంట్స్ చేసి.. వార్తల్లో నిలిచింది. తన ఫేవరెట్ జట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో అంటూ కామెంట్స్ చేసింది.
ఈ రెండు జట్లకు తన సపోర్ట్ ఉంటుందని… ఇందులో ఏ జట్టు గెలిచినా తనకు సంతోషం అంటూ వ్యాఖ్యానించారు. దీంతో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పంత్ ను టార్గెట్ చేసి కావాలని… ఊర్వశి ఇలా కామెంట్స్ చేసిందని.. సోషల్ మీడియాలో ఆమెకు కౌంటర్ ఇస్తున్నారు.