KKR Vs SRH: ఈ ఆటగాళ్లతో నరకమే.. వీళ్లు చెలరేగితే ఆరెంజ్ ఆర్మీపై యుద్ధమే!
కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్‌లో జరగబోయే మ్యాచులో మార్క్‌రమ్ ఆధ్వర్యంలోని ఎస్ఆర్‌హెచ్ విజయం సాధించాలంటే ముగ్గురు కేకేఆర్ ఆటగాళ్లను కీలకంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో ముందుగా.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఇరగదీస్తున్న వెంకటేష్ అయ్యర్ ఒకడు.
KKR Vs SRH: ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్-2023 సీజన్‌లో హైలైట్‌గా నిలిచింది కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్. ఈ మ్యాచులో నితీష్ రాణా ఆధ్వర్యంలోని కోల్‌కతా జట్టు, చివర్లో అద్భుత పోరాట పటిమతో విజయం సాధించింది. ప్రపంచ క్రికెట్ ప్రేమికుల చేత శభాష్ అనిపించుకుంది.
దీంతో ఫుల్ జోష్ మీదున్న కేకేఆర్.. సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) జట్టుతో మ్యాచుకు రెడీ అవుతోంది. శుక్రవారం సాయంత్రం ఈ మ్యాచ్ జరుగుతుంది. కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్‌లో జరగబోయే మ్యాచులో మార్క్‌రమ్ ఆధ్వర్యంలోని ఎస్ఆర్‌హెచ్ విజయం సాధించాలంటే ముగ్గురు కేకేఆర్ ఆటగాళ్లను కీలకంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో ముందుగా.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఇరగదీస్తున్న వెంకటేష్ అయ్యర్ ఒకడు. సునామి ఇన్నింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో ఆకాశమే హద్దుగా చెలరేగాడు ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్. అయితే, పటిష్టమైన సన్ రైజర్స్ పేస్ దళాన్ని ఎదుర్కోవడంలో అతడు ఏ మాత్రం తడబడినా కేకేఆర్‌కు భారీ నష్టం తప్పదు.
ఇక కేకేఆర్ నమ్ముకున్న రెండో ఆటగాడు రింకూ సింగ్. సెన్సేషన్ ఇనింగ్స్‌తో షారుఖ్ ఖాన్ జట్టును సంబరాల్లో ముంచెత్తిన ఈ సునామీ స్టార్.. ఈరోజు సన్ రైజర్స్ హిట్ లిస్ట్‌లో ఒకడిగా చెప్పుకోవచ్చు. సైలెంట్‌గా వచ్చి, వైలెంట్ ఇన్నింగ్స్ నిర్మించగల నేర్పరి రింకూ సింగ్. నితీష్ రానా స్క్వాడ్‌లో డేంజరస్ ప్లేయర్‌గా అడ్డుపడే ఆటగాడు, శార్దూల్ ఠాకూర్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచులో ఠాకూర్ చూపిన కామియో రోల్, అందరి చేత శభాష్ అనిపించుకుంది. కేవలం 29 బంతుల్లో 68 పరుగులు చేసిన ఠాకూర్, ఆర్సీబీ వంటి జట్టును 81 పరుగుల తేడాతో ఓడిపోయేలా చేశాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లను దృష్టిలో పెట్టుకుంటే, సన్ రైజర్స్ గెలుపునకు ఢోకా లేదని నిపుణులు అంటున్నారు.