MS DHONI: విశాఖలో ధోనీ ధనాధన్.. సాగర తీరంలో మహీ మెరుపులు
నిజానికి ధోని ఎప్పుడు బ్యాటింగ్‌కు వస్తాడోనని సీఎస్కే ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ నిరాశ తప్పలేదు. దిల్లీతో మ్యాచ్‌లో అభిమానుల కోరిక తీరింది. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు రావడమే కాదు ధనాధన్ షాట్లతో అలరించాడు.
MS DHONI: చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కానుందన్న వార్తల నేపథ్యంలో ఆ జట్టు ఎక్కడ మ్యాచ్ లు ఆడినా స్టేడియానికి ఫాన్స్ పోటెత్తుతున్నారు. విశాఖ వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లోనూ స్టేడియం ధోనీ నామస్మరణతో మారుమోగింది. నిజానికి ధోని ఎప్పుడు బ్యాటింగ్‌కు వస్తాడోనని సీఎస్కే ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ నిరాశ తప్పలేదు.
Kurchi Madathapetti: వైరల్ వీడియో.. టెక్సాస్ ఈవెంట్‌లో ‘కుర్చీని మడత పెట్టి’కి డ్యాన్సులు..
దిల్లీతో మ్యాచ్‌లో అభిమానుల కోరిక తీరింది. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు రావడమే కాదు ధనాధన్ షాట్లతో అలరించాడు. 16 బంతులాడిన అతను 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. అతను బౌండరీ కొట్టినప్పుడల్లా స్టేడియం దద్దరిల్లింది. జడేజాతో కలిసి దిల్లీ బౌలర్లను అతను భయపెట్టాడు. ఫోర్‌తో పరుగుల ఖాతా తెరిచిన వెంటనే ధోని ఇచ్చిన క్యాచ్‌ను అహ్మద్ పట్టలేకపోయాడు. ఆ తర్వాత ధోని ఆగలేదు. అహ్మద్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టాడు. నోకియా వేసిన చివరి ఓవర్లో రెండేసి సిక్సర్లు, ఫోర్లు కొట్టాడు. సిక్సర్‌తోనే ఇన్నింగ్స్ ముగించాడు.
ధోని జోరు చూశాక.. అతను ఒక ఓవర్ ముందే బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే సీఎస్కే గెలిచేదేమో అనిపించింది. కానీ ధోనీకి చివరి సీజన్ అనే ప్రచారం నేపథ్యంలో ఆఖరి సారిగా అతని మెరుపులు చూడాలన్న అభిమానుల కోరిక ఇప్పటికైతే ఇలా నెరవేరింది.