విరాట్ కోహ్లీ @ 550 రన్ మెషీన్ నయా రికార్డ్

విరాట్ కోహ్లీ మైదానంలో అడుగుపెడితే చాలు రికార్డులు సలామ్ చేస్తాయి... సచిన్ తర్వాత వరల్డ్ క్రికెట్ లో రికార్డుల రారాజుగా పేరు వచ్చింది కోహ్లీకే...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 10, 2025 | 01:20 PMLast Updated on: Mar 10, 2025 | 1:20 PM

Virat Kohli 550 Run Machine New Record

విరాట్ కోహ్లీ మైదానంలో అడుగుపెడితే చాలు రికార్డులు సలామ్ చేస్తాయి… సచిన్ తర్వాత వరల్డ్ క్రికెట్ లో రికార్డుల రారాజుగా పేరు వచ్చింది కోహ్లీకే… ఎందుకంటే ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తూ రన్ మెషీన్ గా పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో వందలకొద్దీ రికార్డులు సృష్టించాడు. ఏ మ్యాచ్ ఆడినా, ఏ మెగా టోర్నీ ఆడినా కోహ్లీ పేరు లేనిదే రికార్డుల పుస్తకంలో పేజీలు మారవు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ ఆద్యంతం రికార్డుల మోత మోగించాడు. ఫైనల్ మ్యాచ్ తో సరికొత్త చరిత్ర సృష్టించాడు.అంతర్జాతీయ కెరీర్ లో అన్ని ఫార్మాట్లూ కలిపి 550వ మ్యాచ్ లు ఆడిన క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. దీంతో ఈ ఘనత సాధించిన రెండో భారత ప్లేయర్ గా నిలిచాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ప్రారంభించిన విరాట్ కోహ్లీ.. అప్పటి నుంచి భారత జట్టులో కీలక ఆటగాడిగా రాణిస్తున్నాడు.

అంతకుముందు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. అతడు తన కెరీర్ లో 664 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. అలానే ప్రపంచ వ్యాప్తంగా 550 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులు ఆడిన ఆరో ప్లేయర్ గానూ నిలిచాడు కోహ్లీ. సచిన్ తో పాటు మహేలా జయవర్దనే, కుమార్ సంగక్కర, సనత్ జయసూర్య, రికీ పాంటింగ్ ఈ ఘనత అందుకున్నారు. సచిన్ తర్వాతి స్థానంలో లంక దిగ్గజం జయవర్థనే 652 మ్యాచ్ లతో ఉండగా…మరో లంక లెజెండ్ 594 మ్యాచ్ లతో మూడో స్థానంలో ఉన్నాడు. శ్రీలంకకే చెందిన సనత్ జయసూర్య 586 మ్యాచ్ లతో నాలుగో స్థానంలో ఉండగా…ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 560 మ్యాచ్ లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మొదటి నాలుగు స్థానాల్లోనూ ఆసియా దేశాలకు చెందిన క్రికెటర్లే చోటు దక్కించుకున్నారు. అగ్రస్థానంలో ఉన్న సచిన్ తన అంతర్జాతీయ కెరీర్ లో 34 వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ గా కొనసాగుతున్నాడు. సచిన్ దరిదాపుల్లో కూడా మరే క్రికెటర్ చేరుకోలేకపోయాడు.

సచిన్ అంతర్జాతీయ కెరీర్ రన్స్ రికార్డును బ్రేక్ చేయాలంటే కోహ్లీ మరో 6700కు పైగా పరుగులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే టీ ట్వంటీ కెరీర్ కు గుడ్ బై చెప్పేసిన రన్ మెషీన్ మరో రెండు,మూడేళ్ళు ఆడినా ఈ రికార్డు సాధిస్తాడా అనేది చూడాలి. గత ఏడాది కాలంగా కోహ్లీ ఫామ్ పేలవంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు కీలక మ్యాచ్ లలో సత్తా చాటినప్పటకీ నిలకడగా రాణిస్తేనే సచిన్ 34 వేల రన్స్ రికార్డును బ్రేక్ చేసే ఛాన్సుంది.