AB De Villiers: విరాట్‌కు తోడుగా డివిలియర్స్.. వచ్చే సీజన్‌లో దోస్తుల ధమాకా

ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు ఆర్సీబీ ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్‌ అందే అవకాశం ఉంది. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ 360 ఏబీడీ డివిలియర్స్‌ మళ్లీ ఆర్సీబీతో జతకట్టనున్నట్లు సమాచారం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 4, 2023 | 04:01 PMLast Updated on: Aug 04, 2023 | 4:01 PM

Virat Kohli Ab De Villiers Reunion At Royal Challengers Bangalore Abd Could Become Mentor

AB De Villiers: ఐపీఎల్‌-2024కు ముందు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తమ కోచింగ్‌ స్టాఫ్‌ను ప్రక్షాళన చేసేందుకు సిద్దమైంది. ఈ క్రమంలో హెడ్‌కోచ్‌ సంజయ్‌ బంగర్‌, క్రికెట్‌ డైరక్టర్‌ మైక్‌ హెస్సన్‌కు ఆర్సీబీ ఉద్వాసన పలికింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ తమ జట్టు హెడ్‌కోచ్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్‌ అండీ ఫ్లవర్‌ను నియమించింది. ఇక ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు ఆర్సీబీ ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్‌ అందే అవకాశం ఉంది. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ 360 ఏబీడీ డివిలియర్స్‌ మళ్లీ ఆర్సీబీతో జతకట్టనున్నట్లు సమాచారం.

అయితే ఆటగాడిగా కాకుండా.. జట్టు సపోర్టింగ్‌ స్టాఫ్‌లో ఏబీడీ భాగం కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సీజన్‌లో తమ జట్టు మెంటార్‌గా డివిలియర్స్‌ను నియమించాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై ఆర్సీబీ యాజమాన్యం ఇప్పటికే ఏబీడీతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. డివిలియర్స్‌ కూడా ఆర్సీబీ ప్రతిపాదనకు ఒప్పుకున్నట్టు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా చాలా సీజన్ల పాటు ఆర్సీబీకి డివిలియర్స్‌ ప్రాతినిధ్యం వహించాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 184 మ్యాచ్‌లు ఆడిన ఏబీడీ 5162 పరుగులు చేశాడు. అతడి ఐపీఎల్ కెరీర్‌లో ౩ సెంచరీలు, 40 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.