Virat Kohli: కోహ్లీ అందుకే కింగ్.. అంతర్జాతీయ క్రికెట్‌లో మరో కొత్త రికార్డు
అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు 2000 ప్లస్ రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌తో విరాట్ ఈ ఘనత అందుకున్నాడు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ ఏడు సార్లు ఒక క్యాలెండర్ ఇయర్‌లో 2000 ప్లస్ రన్స్ చేశాడు. ఈ
Virat Kohli: సమకాలీన క్రికెట్‌లో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ.. సచిన్ రికార్డులను వరుసగా బ్రేక్ చేస్తూ, సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ అదరగొడుతున్నాడు. ఫార్మాట్ ఏదైనా ఈ రన్ మెషీన్‌కు విరామం లేదు. 2023లోనూ కోహ్లీ పరుగుల వరద పారించాడు. తాజాగా మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు 2000 ప్లస్ రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌తో విరాట్ ఈ ఘనత అందుకున్నాడు.
Sandeep Lamichhanne: రేప్ కేసులో దోషిగా తేలిన క్రికెటర్.. కెరీర్ ముగిసినట్టేనా..?
ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ ఏడు సార్లు ఒక క్యాలెండర్ ఇయర్‌లో 2000 ప్లస్ రన్స్ చేశాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర రికార్డును అధిగమించాడు. కుమార సంగక్కర 6 సార్లు 2000 ప్లస్ రన్స్ చేశాడు. ఈ ఏడాది కోహ్లీ.. రెండు ఫార్మాట్లలో కలిపి 2048 పరుగులు చేశాడు. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ఈ ఏడాది టీ ట్వంటీలు ఆడలేదు. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికాపై అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గానూ కోహ్లీ రికార్డు సాధించాడు.
ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును అతను అధిగమించాడు. కాగా, ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 25 టెస్ట్‌ల్లో సచిన్ 1741 రన్స్ చేయగా కోహ్లీ.. 1350 రన్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.