బ్యాగ్స్ మోస్తూ భార్య వెనుక.. లండన్ లో కోహ్లీ ఫోటోలు వైరల్

మన దేశంలో క్రికెటర్లకు ఉన్న క్రేజ్ మరెవరికీ ఉండదు.. బయట ఎక్కడకు వెళ్ళినా మీడియా, ఫ్యాన్స్ , ఫోటోలంటూ హడావుడే హడావుడి....

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 28, 2024 | 08:32 PMLast Updated on: Aug 28, 2024 | 8:32 PM

Virat Kohli Anushka Sharma In London

మన దేశంలో క్రికెటర్లకు ఉన్న క్రేజ్ మరెవరికీ ఉండదు.. బయట ఎక్కడకు వెళ్ళినా మీడియా, ఫ్యాన్స్ , ఫోటోలంటూ హడావుడే హడావుడి…. అందుకే ఇలాంటి లైఫ్ నుంచి విముక్తి కోసం భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లండన్ లో సెటిలయ్యేందుకు సిద్ధమయ్యాడు. భార్య అనుష్కశర్మతో కలిసి ఇప్పటికే అక్కడికి తాత్కాలికంగా మకాం మార్చేసిన కోహ్లీ సాధారణ మనిషిలా జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. గత నెల రోజులుగా విరాట్ లండల్ లోనే కనిపిస్తున్నాడు. ప్రస్తుతం భారత జట్టుకు ఎటువంటి సిరీస్ లు లేకపోవడంతో కోహ్లీ రిలాక్స్ అవుతున్నాడు. రిటైర్మెంట్ తర్వాత లండన్ కే పూర్తిగా షిప్ట్ అవుతున్న విరాట్ ప్రస్తుతం అక్కడ బ్యాగ్స్ మోస్తూ సెలబ్రిటీ లైఫ్ కు దూరంగా టైం గడుపుతున్నాడు.

తాజాగా కోహ్లీ లండన్ వీధుల్లో తిరుగుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎంత బిగ్ సెలబ్రిటీ అయినా భార్యకు గులామే అంటూ కోహ్లీని ఉద్దేశించి పలువురు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే విరుష్క జోడీ ఇప్పటికే లండన్​లో ఓ ఖరీదైన బంగ్లాను వాళ్లు కొన్నట్టు, త్వరలో అక్కడికి షిఫ్ట్ అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. లండన్​లో అయితే సెలెబ్రిటీ స్టేటస్​కు దూరంగా, సింపుల్​గా లైఫ్​ను లీడ్ చేయొచ్చనే ఆలోచనతో విరుష్క దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.