Virat Kohli: 16 ఏళ్ళ సచిన్ రికార్డ్‌పై విరాట్ కన్ను..
ఇప్పటికే వన్డే క్రికెట్‌లో 48 సెంచరీలు చేసిన కోహ్లీ.. ఈ రోజు సెంచరీ చేస్తే 49 సెంచరీలతో వన్డేలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా క్రికెట్ గాడ్ సచిన్ రికార్డ్ సమం చేస్తాడు. వరల్డ్ కప్‌లో నేడు భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది.
Virat Kohli: టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ రికార్డుల వర్షం కురిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న విరాట్.. తాజాగా మరో రెండు రికార్డులపై గురి పెట్టాడు. వీటిలో ఒకటి.. వన్డేల్లో సచిన్ అత్యధిక సెంచరీల రికార్డ్. ఇప్పటికే వన్డే క్రికెట్‌లో 48 సెంచరీలు చేసిన కోహ్లీ.. ఈ రోజు సెంచరీ చేస్తే 49 సెంచరీలతో వన్డేలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా క్రికెట్ గాడ్ సచిన్ రికార్డ్ సమం చేస్తాడు.
వరల్డ్ కప్‌లో నేడు భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబై వాంఖడేలో జరగనున్న ఈ మ్యాచ్‌లో భారత్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. ఇక ఈ మ్యాచ్‌లో సచిన్ 16 ఏళ్ళ అరుదైన రికార్డ్‌పై కోహ్లీ దృష్టి పెట్టాడు. వన్డేల్లో క్యాలెండర్‌లో కోహ్లీ ఇప్పటివరకు 7 సార్లు 1000 పరుగుల మార్క్ అందుకున్నాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సైతం 7సార్లు ఈ ఘనత సాధించగా.. ఈ అరుదైన రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ ఈ ఏడాది 22 వన్డేలు ఆడి 966 పరుగులు చేసాడు. విరాట్ ఖాతాలో నాలుగు సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
కాగా.. ఈ ఏడాది మరో 34 పరుగులు పరుగులు చేస్తే 8 సార్లు ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా నిలుస్తాడు. ఇక వీరిద్దరి తర్వాత భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ, ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్, శ్రీలంక మాజీ స్టార్ ప్లేయర్ కుమార సంగక్కర 6 సార్లు ఈ ఫీట్ నమోదు చేశారు.