VIRAT KOHLI: సెంచరీ చేసినా విమర్శలే.. కోహ్లీపై మండిపడుతున్న ఫ్యాన్స్
రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి అజేయ శతకం బాదినా జట్టును గెలిపించలేకపోయాడు. మరో ఓపెనర్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తప్ప మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో 183 పరుగులకే పరిమితమైంది.

VIRAT KOHLI: టీ ట్వంటీ ఫార్మాట్‌లో సెంచరీ అంటే పెద్ద ఘనతే. చాలా వేగంగా పరుగులు సాధిస్తే తప్ప శతకం సాధ్యం కాదు. అయితే సెంచరీ కొట్టినా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తే అది ఆ ప్లేయర్‌కు బాధగానే ఉంటుంది. ప్రస్తుతం కోహ్లీ ఇదే పరిస్థితి ఫేస్ చేస్తున్నాడు. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి అజేయ శతకం బాదినా జట్టును గెలిపించలేకపోయాడు.
Ponguleti Srinivasa Reddy: వివాదంలో పొంగులేటి.. స్మగ్లింగ్ కేసులో మంత్రి పొంగులేటి కొడుకు..
మరో ఓపెనర్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తప్ప మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో 183 పరుగులకే పరిమితమైంది. ఈ ఓటమి ఎఫెక్ట్ టీమ్‌పై కంటే కూడా కోహ్లీపైనే ఎక్కువగా పడింది. సెంచరీ చేసినా విరాట్ కోహ్లిపై మాత్రం విమర్శల వర్షం కురుస్తోంది. కోహ్లి స్వార్థపూరిత ఇన్నింగ్స్ వల్లే ఆర్సీబీ 183 పరుగులకు పరిమితమైందని.. ఒకరకంగా జట్టు ఓటమికి అతడు కూడా కారణమే అని నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లి 72 బంతుల్లో 113 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. నిజానికి కోహ్లి వంద పరుగుల మార్కు అందుకోవడానికి 67 బంతులు తీసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో.. భారత గడ్డపై సెంచరీ కొట్టడానికి ఇన్ని బంతులు తీసుకున్న తొలి క్రికెటర్‌గా చెత్త రికార్డు సృష్టించాడు.
దీంతో కోహ్లిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాదు.. టీ20 క్రికెట్‌లో కోహ్లి యాభై కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్న సందర్భాల్లో అతడి జట్టు 96 శాతం మ్యాచ్‌లు ఓడిపోయిందంటూ గణాంకాలు షేర్ చేస్తున్నారు. అంతేకాదు.. సెల్ఫిష్ అంటూ కోహ్లిని ట్రెండ్ చేస్తున్నారు. రాజస్తాన్ రాయల్స్ సైతం.. 200 పరుగులకు పైగా స్కోరు సాధ్యమయ్యే చోట 184 కూడా పర్లేదులెండి అంటూ కోహ్లి ఇన్నింగ్స్‌పై సెటైర్లు వేసింది.