VIRAT KOHLI: కోహ్లీ తీవ్ర వేదనతో కనిపించిన వేళ.. విరాట్ వీడియో వైరల్
తాజాగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓటమి తర్వాత మైదానంలో కోహ్లీ వీడియో వైరల్‌గా మారింది. వన్డే ప్రపంచకప్ గెలుచుకున్న ఆనందంతో ఆస్ట్రేలియా సంబరాల్లో మునిగియినప్పుడు.. విరాట్ కోహ్లీ తీవ్రంగా బాధపడిన వీడియో తాజాగా ట్రెండవుతోంది.

VIRAT KOHLI: సొంతగడ్డపై టైటిల్ ఫేవరెట్.. సూపర్ ఫామ్.. దానికి తగ్గట్టే వరుసగా 10 విజయాలు.. ఒక్క ఓటమి లేకుండా ఫైనల్లో ఎంట్రీ.. వరల్డ్ కప్ గెలవడానికి ఇంత కంటే మంచి అవకాశం ఏముంటుంది. అయితే ఊహించని విధంగా భారత అభిమానులకు షాక్ ఇస్తూ ఆస్ట్రేలియా టైటిల్ ఎగరేసుకుపోయింది. అంచనాలు పెట్టుకున్న టీమిండియా తుది మెట్టుపై చతికిలపడింది. ఈ ఓటమి అభిమానులను ఎంతో బాధ పెట్టింది. అంతకంటే ఎక్కువగా ఆటగాళ్లు కూడా బాధపడ్డారు.
T20 WORLD CUP: ఫాన్స్‌కు గుడ్ న్యూస్.. టీ 20 వరల్డ్ కప్ జట్టులో కోహ్లీ, రోహిత్
తాజాగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓటమి తర్వాత మైదానంలో కోహ్లీ వీడియో వైరల్‌గా మారింది. వన్డే ప్రపంచకప్ గెలుచుకున్న ఆనందంతో ఆస్ట్రేలియా సంబరాల్లో మునిగియినప్పుడు.. విరాట్ కోహ్లీ తీవ్రంగా బాధపడిన వీడియో తాజాగా ట్రెండవుతోంది. ఒకవైపు కప్ గెలిచిన ఆనందంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటుంటే.. మరోవైపు భారత క్రికెటర్లు బాధతో మైదానం వీడారు. ఆ సమయంలో కోహ్లీ తీవ్ర నిరాశతో కనిపించాడు. తోటి ఆటగాళ్ల వైపు వస్తూ.. వికెట్ల వద్దకు రాగానే తన క్యాప్‌తో బెయిల్స్‌ను గిరాటేశాడు. ఫైనల్లో పరాజయం విరాట్‌ను ఎంత బాధపెట్టిందనేది ఈ వీడియో చూసినవారికి స్పష్టంగా అర్ధమవుతుంది.
ఆ నిమిషం కోహ్లీ వేదన స్పష్టంగా కనిపించిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మెగా టోర్నీలో అదరగొట్టిన కోహ్లీ వన్డే వరల్డ్ కప్‌లో 765 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలవడమే కాదు సచిన్ రికార్డునూ బ్రేక్ చేశాడు. అదే ఊపులో దేశానికి వరల్డ్ కప్ అందిస్తాడని భావించినా.. దురదృష్టవశాత్తూ ఫైనల్లో భారత్ బ్యాటర్లు నిరాశపరిచారు. ఫలితంగా మూడోసారి ప్రపంచ విజేతగా నిలిచే అవకాశం చేజారిపోయింది.
UNSEEN VIDEO OF KOHLI 💔 pic.twitter.com/o4ZkZhf3zh
— cricket videos (@RizwanStum60450) January 1, 2024