VIRAT KOHLI: ఐపీఎల్‌లో కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు
చెన్నైతో మ్యాచ్‌లో విరాట్ మరో 6 పరుగులు చేస్తే.. టీ20ల్లో 12000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 11994 పరుగులు ఉన్నాయి. ఈ జాబితాలో విరాట్ తర్వాత రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ ఉన్నారు.
VIRAT KOHLI: ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22, శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. చెన్నై చెపాక్ వేదికగా జరిగే సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఆర్సీబీతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. చెన్నైతో మ్యాచ్‌లో విరాట్ మరో 6 పరుగులు చేస్తే.. టీ20ల్లో 12000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు.
MS DHONI: కెప్టెన్లకే కెప్టెన్ లాంటోడు.. సారథిగా ధోనీ రికార్డులు ఇవే
ప్రస్తుతం విరాట్ ఖాతాలో 11994 పరుగులు ఉన్నాయి. ఈ జాబితాలో విరాట్ తర్వాత రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ ఉన్నారు. అలాగే ఈ మ్యాచ్‌లో విరాట్ మరో క్యాచ్ పడితే టీ20ల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం విరాట్.. సురేశ్ రైనాతో కలిసి టాప్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ మరో 4 క్యాచ్‌లు పడితే ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 106 క్యాచ్‌లు ఉండగా.. రైనా 109 క్యాచ్‌లతో టాప్‌లో ఉన్నాడు.
అలాగే ఈ మ్యాచ్‌లో విరాట్ మరో పరుగు చేస్తే సీఎస్‌కేపై 1000 పరుగుల మార్కును అందుకుంటాడు. విరాట్ మరో హాఫ్ సెంచరీ చేస్తే ఐపీఎల్‌లో చెన్నైపై 10 హాఫ్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ఏదేమైనా ఐపీఎల్ తొలి మ్యాచ్ రికార్డులకు వేదిక కావడం ఖాయంగా కనిపిస్తోంది.