Virat Kohli: బీసీసీఐకి షాకిచ్చిన విరాట్ కోహ్లీ.. ఆ మ్యాచులకు దూరం..

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ మొత్తం 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో 3 T20, 3 ODIలు కాకుండా, 2 టెస్ట్ మ్యాచ్‌లు ఉంటాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం విరాట్ కోహ్లి సౌతాఫ్రికా టూర్‌లో వన్డే, టీ20 ఆడబోవడం లేదని, వైట్ బాల్ సిరీస్‌కు విరామం ఇవ్వడమే దీనికి కారణమని తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 29, 2023 | 05:33 PMLast Updated on: Nov 29, 2023 | 5:33 PM

Virat Kohli Informs Bcci About Indefinite Break From Odis T20is

Virat Kohli: డిసెంబరు 10 నుంచి భారత్‌ దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. కానీ, అంతకు ముందు ఈ టూర్‌లో టీ20 ఇంటర్నేషనల్, వన్డే ఆడేందుకు విరాట్ కోహ్లీ నిరాకరించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. విరాట్ కోహ్లీ తన నిర్ణయాన్ని బీసీసీఐకి ఇప్పటికే తెలియజేసినట్లు సమాచారం. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ మొత్తం 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో 3 T20, 3 ODIలు కాకుండా, 2 టెస్ట్ మ్యాచ్‌లు ఉంటాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం విరాట్ కోహ్లి సౌతాఫ్రికా టూర్‌లో వన్డే, టీ20 ఆడబోవడం లేదని, వైట్ బాల్ సిరీస్‌కు విరామం ఇవ్వడమే దీనికి కారణమని తెలుస్తోంది.

Ishan Kishan: కష్టాలు తెచ్చిపెట్టిన కిషన్ కీపింగ్.. ఆసీస్ విజయానికి అదే కారణం..

అయితే, టెస్టు సిరీస్‌లో ఆడతాడా..? లేదా..? అనే ప్రశ్నపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, దక్షిణాఫ్రికా పర్యటనలో రెండు టెస్ట్ మ్యాచ్‌లలో విరాట్ ఆడటం చూడొచ్చని తెలుస్తోంది. దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టును ఇంకా ఎంపిక చేయలేదు. దీనికి సంబంధించి అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ త్వరలో సమావేశం కానుంది. ఆ సమావేశానికి ముందు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సెలక్షన్ కమిటీ గురించి ఓ వార్తలను ప్రచురించింది. వైట్ బాల్ సిరీస్ నుంచి విరామం తీసుకోవాలని భావిస్తున్నట్లు కోహ్లీ.. బీసీసీఐకి, సెలెక్టర్లకు చెప్పినట్లు పేర్కొంది. అలాగే అతను రెడ్ బాల్ క్రికెట్‌లో ఆడతానని బీసీసీఐకి చెప్పినట్లు తెలుస్తోంది.

దీన్ని బట్టి అతను దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్‌లో మాత్రమే ఆడగలడని స్పష్టమవుతోంది. ఇక 2023 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. అతను 11 ఇన్నింగ్స్‌ల్లో 765 పరుగులు చేశాడు. ప్రస్తుతం కోహ్లీ లండన్‌లో హాలిడేలో ఉన్నాడు.