Virat Kohli: కోహ్లీ రీ ఎంట్రీ ఎప్పుడంటే..
. ఇప్పుడు విరాట్ కోహ్లీ రీ ఎంట్రీ ఎప్పుడు అనేదే ఫాన్స్‌ను వెంటాడుతున్న ప్రశ్న. విరాట్ కోహ్లీ మళ్లీ భారత జట్టు జెర్సీలో కనిపించాలంటే జూన్ వరకు ఆగాల్సిందే. ఎందుకంటే భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ మార్చి 11న ముగియనుంది.

Virat Kohli: ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. ముందు తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనన్న కోహ్లి.. ఇప్పుడు మిగిలిన 3 మ్యాచ్‌ల నుంచి కూడా వైదొలిగాడు. వ్యక్తిగత కారణాల వల్ల అతను మొత్తం సిరీస్‌కు అందుబాటులో లేడని బీసీసీఐ ప్రకటించింది. ఆ కారణాలు ఏంటనేది మాత్రం వెల్లడి కాలేదు. ఇప్పుడు విరాట్ కోహ్లీ రీ ఎంట్రీ ఎప్పుడు అనేదే ఫాన్స్‌ను వెంటాడుతున్న ప్రశ్న.
Harish Shankar: మాస్ వార్నింగ్.. హరీష్ శంకర్ బోల్డ్ స్టేట్‌మెంట్
విరాట్ కోహ్లీ మళ్లీ భారత జట్టు జెర్సీలో కనిపించాలంటే జూన్ వరకు ఆగాల్సిందే. ఎందుకంటే భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ మార్చి 11న ముగియనుంది. ఈ సిరీస్ తర్వాత టీమిండియా ఏ మ్యాచ్ ఆడడం లేదు. కొన్ని రోజుల బ్రేక్ తర్వాత ఐపీఎల్ ఆడబోతున్నారు. దీంతో కోహ్లీ ఐపీఎల్ ద్వారా మళ్లీ గ్రౌండ్‌లోకి అడుగు పెట్టనున్నాడు. ఈసారి ఐపీఎల్ మార్చి 22 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగానే కింగ్ కోహ్లి ఆర్సీబీ తరపున ఆడుతూ మళ్లీ మైదానంలో కనిపించనున్నాడు.
ఐపీఎల్ ముగిసిన వెంటనే జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌లో జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌తో విరాట్ కోహ్లీ మళ్లీ బ్లూ జెర్సీలో కనిపించనున్నాడు.