Virat Kohli : వరల్డ్ క్రికెట్ లో రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా కోహ్లీ @ 250
ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ లో రికార్డులకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ...ఫార్మాట్ తో సంబంధం లేకుండా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంటాడు.

Virat Kohli is the most recognizable name in world cricket at present.
ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ లో రికార్డులకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ…ఫార్మాట్ తో సంబంధం లేకుండా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంటాడు. తాజాగా ఐపీఎల్ లో మరో అరుదైన రికార్డును అందుకోబోతున్నాడు. ఢిల్లీతో ఆడే మ్యాచ్ ద్వారా ఐపీఎల్ చరిత్రలోనే ఎవ్వరూ సాధించని, సాధించలేని ఘనతను సొంతం చేసుకోబోతున్నాడు. అదేంటంటే? ఢిల్లీతో ఆడే మ్యాచ్ విరాట్ కోహ్లీకి 250వ ఐపీఎల్ మ్యాచ్. దాంతో 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే ఫ్రాంచైజీ తరఫున ఎక్కువ మ్యాచ్ లు ఆడిన ఏకైక ప్లేయర్ గా విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు. ఈ జాబితాలో రెండో ప్లేస్ లో ఎంఎస్ ధోని చెన్నై ఆ తర్వాత వరసగా రోహిత్ శర్మ ముంబై, సురేష్ రైనా, సునీల్ నరైన్ ఉన్నారు. అయితే వీరందరూ కోహ్లీకి చాలా దూరంలో ఉన్నారు. దీంతో కోహ్లీ నెలకొల్పే ఈ రికార్డ్ ను బద్దలు కొట్టే మెునగాడు లేడంటూ ఫాన్స్ ట్వీట్ చేస్తున్నారు.