VIRAT KOHLI: కోహ్లీకి అరుదైన అవార్డ్.. మెస్సీని వెనక్కి నెట్టిన భారత స్టార్ క్రికెటర్

దిగ్గజ క్రీడాకారులు క్రిస్టియానో రొనాల్డో, మహ్మద్ అలీ, మైకేల్ జొర్డాన్ వంటి ఎంతో మంది ప్లేయర్లు కూడా ఈ అవార్డు రేసులో నిలబడ్డారు. ఫైనల్ స్టేజ్‌కు మాత్రం మెస్సీ, కోహ్లినే చేరుకోగలిగారు. తమ ఆటలో ఈ ఏడాది అత్యుత్తమంగా సత్తాచాటిన వారిని ఓటింగ్‌తో విజేతగా ప్రకటిస్తారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 1, 2024 | 02:58 PMLast Updated on: Jan 01, 2024 | 2:58 PM

Virat Kohli Named Pubity Athlete Of The Year 2023 Defeating Lionel Messi

VIRAT KOHLI: వరల్డ్ క్రికెట్‌లో రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌ విరాట్ కోహ్లీ. మైదానంలో పరుగుల వరద పారించడమే కాదు.. రికార్డులు, వాటితో పాటు అవార్డులూ ఎన్నో అందుకున్నాడు. తాజాగా మరో అరుదైన పురస్కారం కోహ్లీని వరించింది. ఈ క్రమంలో దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్‌ లియోనల్ మెస్సీని స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఓడించాడు. ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో కోహ్లీ, మెస్సీ తలపడ్డారు. ఓటింగ్‌ తీర్పుతో ప్రకటించే ఈ అవార్డును విరాట్ కోహ్లీ కైవసం చేసుకున్నాడు.

Devara: దండయాత్ర.. దేవర’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్..

దిగ్గజ క్రీడాకారులు క్రిస్టియానో రొనాల్డో, మహ్మద్ అలీ, మైకేల్ జొర్డాన్ వంటి ఎంతో మంది ప్లేయర్లు కూడా ఈ అవార్డు రేసులో నిలబడ్డారు. ఫైనల్ స్టేజ్‌కు మాత్రం మెస్సీ, కోహ్లినే చేరుకోగలిగారు. తమ ఆటలో ఈ ఏడాది అత్యుత్తమంగా సత్తాచాటిన వారిని ఓటింగ్‌తో విజేతగా ప్రకటిస్తారు. చివరికి కోహ్లి విన్నర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లికి 2023 ఏడాది కమ్‌బ్యాక్ ఇయర్‌‌గా చెప్పొచ్చు. వరుస వైఫల్యాలు, తీవ్ర విమర్శలతో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత అద్భుతంగా పుంజుకున్న కోహ్లీ మునుపటి ఫామ్ అందుకున్నాడు. అసాధారణ రికార్డులు బద్దలుకొడుతూ విమర్శకుల నోళ్లు మూయించాడు. పరుగుల వరద పారిస్తూ ఈ ఏడాది కూడా భారత్‌కు ఎన్నో విజయాలు అందించాడు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సాధించిన వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డును కూడా కోహ్లి ఈ ఏడాదిలోనే బ్రేక్ చేశాడు. ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో అతను ఈ మైలురాయి అందుకున్నాడు.

అలాగే ఇప్పటివరకు ఎవరికీ సాధ్యపడని మరో రెండు రికార్డులను కోహ్లి నెలకొల్పాడు. వరల్డ్ కప్‌లో 765 పరుగులు చేసిన విరాట్.. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఇక ఏడు భిన్నమైన క్యాలెండర్‌ సంవత్సరాల్లో 2000కు పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా కూడా కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు మెస్సీని వెనక్కి నెట్టి అరుదైన అవార్డు అందుకోవడంతో 2023 సంవత్సరం కోహ్లికి మరింత స్పెషల్‌గా మారింది.