Virat Kohli: కోహ్లీ రీప్లేస్‌మెంట్ ఎవరు.. ఆ ముగ్గురిలో ఒకరికి ఛాన్స్..
కోహ్లి స్థానానికి సీనియర్ ప్లేయర్ పుజారాతో పాటు రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్ పోటీ పడుతున్నారు. సీనియర్ ప్లేయర్ చటేశ్వర పుజారా రంజీ ట్రోఫీలో ఆడుతుండగా.. యువ ప్లేయర్లు రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్ ఇంగ్లాండ్ ఎ జట్టుతో ఆడుతున్న భారత్ ఎ జట్టుకు ఆడుతున్నారు.

Virat Kohli: హైదరాబాద్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ ఐదు టెస్టుల సిరీస్ షురూ కానుంది. ఈ మెగా సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమిస్తుండగా.. ఇప్పటికే రెండు జట్లు ప్రిపరేషన్‌లో ఫుల్ బిజీగా ఉన్నాయి. అయితే తొలి టెస్టుకు ఆరంభానికి ముందు భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరమయ్యాడు. ఇప్పుడు కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది.
Saif Ali Khan: దేవర’ షూటింగ్‌లో ప్రమాదం.. సైఫ్ అలీ ఖాన్‌కు గాయాలు..
దీని కోసం చాలా పేర్లు వినిపిస్తున్నాయి. కోహ్లి స్థానానికి సీనియర్ ప్లేయర్ పుజారాతో పాటు రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్ పోటీ పడుతున్నారు. సీనియర్ ప్లేయర్ చటేశ్వర పుజారా రంజీ ట్రోఫీలో ఆడుతుండగా.. యువ ప్లేయర్లు రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్ ఇంగ్లాండ్ ఎ జట్టుతో ఆడుతున్న భారత్ ఎ జట్టుకు ఆడుతున్నారు. పుజారా జాతీయ జట్టుకు దూరమైన తర్వాత ఇటీవలి రంజీ ట్రోఫీలో నిలకడగానే ఆడుతున్నాడు. అయితే సెలక్టర్లు మాత్రం అతన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. యువ క్రికెటర్ల వైపే సెలక్షన్ కమిటీ మొగ్గుచూపుతోంది. దీంతో పుజారా కంటే రజత్, సర్ఫరాజ్‌లలో ఒకరికి కోహ్లి ప్లేస్‌లో చోటు దక్కే అవకాశం ఉందని అంచనా.
రజత్ పాటిదార్ ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 151 రన్స్ చేశాడు. అదే మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరితో పాటు రింకూసింగ్ పేరు కూడా వినిపిస్తోంది. కోహ్లీ స్థానంలో ఎవరు ఎంపికైనా జట్టులో నిలదొక్కుకునేందుకు ఈ సిరీస్ మంచి అవకాశంగా చెప్పొచ్చు.