Virat Kohli: టీ ట్వంటీల్లో కోహ్లీ కెరీర్ ముగిసినట్టే.. వరల్డ్ కప్ టీమ్ నుంచి కోహ్లీ ఔట్..?
వరల్డ్ కప్‌కు ఆతిథ్యమివ్వనున్న కరేబియన్, అమెరికా పిచ్‌లు కోహ్లీ బ్యాటింగ్‌కు సూట్ కావని సెలక్టర్లు ఈ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. దీనిపై ప్రస్తుతం సెలక్షన్ కమిటీ చర్చించినట్టు తెలుస్తోంది. అలాగేకోహ్లీని ఒప్పించే బాధ్యత చీఫ్ సెలక్టర్ అగార్కర్ డీల్ చేసే అవకాశముంది.
Virat Kohli: బీసీసీఐ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవాలని పట్టుదలగా ఉన్న సెలక్టర్లు.. జట్టు ఎంపికలో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. దీనిలో భాగంగా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని తప్పించాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వరల్డ్ కప్‌కు ఆతిథ్యమివ్వనున్న కరేబియన్, అమెరికా పిచ్‌లు కోహ్లీ బ్యాటింగ్‌కు సూట్ కావని సెలక్టర్లు ఈ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.
JANASENA SEATS : చివరకు మిగిలింది 21
దీనిపై ప్రస్తుతం సెలక్షన్ కమిటీ చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే కోహ్లీని తప్పించే విషయంలో మరోసారి కోచ్ ద్రావిడ్‌తోనూ మాట్లాడాలని నిర్ణయించుకున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఒకవేళ కోహ్లీని తప్పించాలని తుది నిర్ణయం తీసుకుంటే.. ఆ బాధ్యత అగార్కర్‌కే అప్పగించాలని బీసీసీఐ డిసైడ్ అయినట్టు బోర్డు వర్గాల సమాచారం. కోహ్లీని ఒప్పించే బాధ్యత చీఫ్ సెలక్టర్ అగార్కర్ డీల్ చేసే అవకాశముంది. గత టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌లో కోహ్లీ కనిపించలేదు. కేవలం వన్డేలు, టెస్టుల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. వచ్చే వరల్డ్ కప్‌లో రోహిత్, కోహ్లీ ఆడతారని ఇటీవలే వార్తలు వచ్చాయి. ఆసీస్‌తో సిరీస్‌కు కూడా వీరిద్దరినీ ఎంపిక చేశారు.
అయితే కోహ్లీ విషయంలో మాత్రం సెలక్టర్లు పునరాలోచనలో పడినట్టు కనిపిస్తోంది. వరల్డ్ కప్‌నకు ఎక్కువమంది యువక్రికెటర్లవైపే సెలక్టర్లు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. కాగా కోహ్లీ ఇప్పటి వరకూ 117 టీ ట్వంటీల్లో 4037 పరుగులు చేశాడు. దీనిలో ఒక సెంచరీ, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఒకవేళ సెలక్టర్ల నిర్ణయం ఇదే అయితే కోహ్లీ ఫ్యాన్స్‌కు షాకే. ఇక విరాట్.. షార్ట్ ఫార్మాట్‌కు సంబంధించి కేవలం ఐపీఎల్‌లో మాత్రమే కనిపిస్తాడని చెప్పొచ్చు.