విరాట్ నువ్వు తోపులకే తోపు ఆకాశానికెత్తేసిన పాక్ మీడియా

మన ప్రత్యర్థులు మనల్ని పొగిడితే ఆ కిక్కే వేరు.. భారత్ క్రికెటర్లు అంటేనే విద్వేషంతో రగిలిపోయే పాక్ క్రికెట్ జట్టు, అక్కడి మీడియా, ఆ దేశ మాజీలు ఇప్పుడు మన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 25, 2025 | 03:15 PMLast Updated on: Feb 25, 2025 | 3:15 PM

Virat Kohli Pakistan Media Praised

మన ప్రత్యర్థులు మనల్ని పొగిడితే ఆ కిక్కే వేరు.. భారత్ క్రికెటర్లు అంటేనే విద్వేషంతో రగిలిపోయే పాక్ క్రికెట్ జట్టు, అక్కడి మీడియా, ఆ దేశ మాజీలు ఇప్పుడు మన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ పై భారత్ ను ఒంటిచేత్తో గెలిపించిన విరాట్ ను పాకిస్తాన్ మీడియా ఆకాశానికెత్తేసింది. భారత్ తో మ్యాచ్ పాక్ మ్యాచ్ అనగానే మన ఆటగాళ్లను తక్కువ చేస్తూ పాకిస్థాన్ మీడియా వార్తలుంటాయి. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ సై అద్భుత సెంచరీ సాధించిన కోహ్లీని ఇప్పుడు పాక్ మీడియా ప్రశంసలతో ముంచెత్తింది. అతని ఈ సెన్సేషనల్ ఇన్నింగ్స్ పై పాక్ మీడియా పొగడ్తల వర్షం కురిపించడం ఆశ్చర్యపరిచింది.

సాధారణంగా తమ దేశ క్రికెట్ దిగ్గజాలను భారత ఆటగాళ్లతో పోలుస్తూ హైలైట్ చేయడం పాకిస్థాన్ మీడియాకు అలవాటే. కానీ ఇప్పుడు మాత్రం పాక్ లెజెండ్స్ ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్ ను కాదని కోహ్లీని ఆల్ టైం గ్రేట్ అంటూ అక్కడి మీడియా ఎలివేషన్ ఇస్తోంది. భారత్, పాకిస్థాన్ మధ్య పోరులో కోహ్లిని మించిన వాళ్లను లేరని వార్తలు రాస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ పై సెంచరీతో చెలరేగిన కోహ్లీనే గ్రేట్ అంటూ పాక్ మీడియా కథనాలు రాసింది. ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక డాన్ పాకిస్థాన్ సవాలు విసిరే స్కోరు చేయడంలో విఫలమైంది. దిగ్గజం వసీం అక్రమ్ లేదా ఇమ్రాన్ ఖాన్ ఎవరు కూడా భారత్, పాక్ మ్యాచ్ ల్లో కోహ్లి కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపలేదు. కోహ్లీ తప్ప మరే ఇతర ఆటగాడు గ్రేట్ కాదంటూ పేర్కొంది. మరో ప్రధాన వెబ్‌సైట్ జియో న్యూస్, ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ కూడా కోహ్లి ఇన్నింగ్స్ ను హైలైట్ చేశాయి.

దాదాపు ఏడాది కాలంగా పరుగులు చేసేందుకు సతమతమలుతున్న కోహ్లీ పాకిస్థాన్ పై సెంచరీతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. పాక్ తో మ్యాచ్ లో అజేయంగా 100 పరుగులు సాధించాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో అతనికిది ఆరో సెంచరీ. పాకిస్థాన్ పై నాలుగో సెంచరీ. ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెంచరీ. ఈ మ్యాచ్‌లో వ్య‌క్తిగ‌త స్కోరు 15 ప‌రుగుల వ‌ద్ద కోహ్లీ వ‌న్డేల్లో 14 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు. వ‌న్డేల్లో అత్యంత వేగంగా 14 000 ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఈ క్ర‌మంలో దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును బ్రేక్ చేశాడు. స‌చిన్ 350 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకోగా కోహ్లీ కేవ‌లం 287 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘ‌న‌త సాధించాడు. అలాగే పాక్ పై ఐసీసీ టోర్నీల్లో అత్యధిక సెంచరీల రికార్డుతో పాటు ఎక్కువ సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు అందుకున్న ఆటగాడిగానూ నిలిచాడు. కాగా వరుసగా రెండు మ్యాచ్ ల్లోనూ గెలిచిన భారత్ ఈ టోర్నీలో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. మరోవైపు రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన పాకిస్థాన్ టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది.