Virat Kohli: కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్‌.. ఇంతకీ కోహ్లీ ఏం చేశాడంటే..!

ఆటగాళ్లకు బీసీసీఐ ఫిట్‌నెస్‌ టెస్టులు నిర్వహిస్తోంది. లేటెస్ట్‌గా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ యోయో టెస్టును క్లియర్‌ చేశాడు. యోయో టెస్టులో తాను 17.2 స్కోర్‌ సాధించినట్లు ఇన్‌స్టా స్టోరీలో చెప్పాడు. ఇదే ఇప్పుడు కోహ్లీ బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యేలా చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 25, 2023 | 04:58 PMLast Updated on: Aug 25, 2023 | 4:58 PM

Virat Kohli Posts Yo Yo Test Score On Instagram Bcci Asks Players Not To Share It

Virat Kohli: ఆగష్టు 30 నుంచి స్టార్ట్‌ కాబోతున్న ఆసియా కప్‌ 2023 కోసం టీమిండియా రెడీ అవుతోంది. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఏర్పాటు చేసిన స్పెషల్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌లో ప్లేయర్స్ పాల్గొంటున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ తెగ చెమటోడుస్తున్నారు. మరోవైపు ఆటగాళ్లకు బీసీసీఐ ఫిట్‌నెస్‌ టెస్టులు నిర్వహిస్తోంది. లేటెస్ట్‌గా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ యోయో టెస్టును క్లియర్‌ చేశాడు. యోయో టెస్టులో తాను 17.2 స్కోర్‌ సాధించినట్లు ఇన్‌స్టా స్టోరీలో చెప్పాడు.

ఇదే ఇప్పుడు కోహ్లీ బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. యోయో టెస్టులో తాను 17.2 స్కోర్‌ను సాధించినట్లు విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. జట్టుకు సంబంధించిన అంతర్గత విషయాలను నెట్టింట షేర్‌ చేయవద్దని కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్‌ ఇచ్చిందట. యోయో టెస్టుకు సంబంధించిన స్కోర్‌ను విరాట్ పోస్ట్‌ చేయడం బీసీసీఐ అపెక్స్ బాడీ ఉన్నతాధికారులకు నచ్చలేదని పలు నివేదికలు చెప్తున్నాయి. మరోసారి ఇలా చేయొద్దని కోహ్లీని బీసీసీఐ అధికారులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. జట్టుకు సంబంధించిన అంతర్గత సమాచారాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయకూడదని భారత ఆటగాళ్లను హెచ్చరించామని, ప్లేయర్స్ తమ ట్రైనింగ్‌కు సంబంధించిన ఫోటోలను షేర్‌ చేసుకోవచ్చు కానీ.. యోయో టెస్టు స్కోర్‌ను, అంతర్గత విషయాలను బహిర్గతం చేయకూడదని హెచ్చరించినట్లు బీసీసీఐ అధికారులు అంటున్నారు.

అలా చేయడం ఆటగాళ్ల కాంట్రాక్ట్‌ నిబంధనలకు విరుద్ధమని బీసీసీఐ అంటోంది. వెస్టిండీస్‌ పర్యటనలో వన్డే సిరీస్ తర్వాత.. విరాట్‌ కోహ్లీ స్వదేశానికి వచ్చి విశ్రాంతి తీసుకున్నాడు. కొన్ని రోజులు కుటుంబంతో గడిపిన కోహ్లీ.. ఆసియా కప్‌కి సిద్ధమవుతున్నాడు. ఎన్సీఏలో వారం రోజుల పాటు జరిగే ట్రెయినింగ్‌ క్యాంపులో భాగం అయ్యాడు. ఆసియా కప్‌ 2023లో భారత్ ఫెవరేట్ జట్టుగా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో కోహ్లీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.