Virat Kohli: అదో పనికిమాలిన న్యూస్ పేపర్

తాజాగా కోహ్లీ ఇంస్టాగ్రామ్‌లో చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక జాతీయ పత్రిక మీద అసహనం ప్రదర్శిస్తూ కోహ్లీ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. తన మీద వస్తున్న ఫేక్ న్యూస్ చూసి ఆగ్రహం వ్యక్తం చేసాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 16, 2023 | 03:58 PMLast Updated on: Aug 16, 2023 | 3:58 PM

Virat Kohli Quashes Fake News About Building Cricket Pitch At Alibaug Farmhouse

Virat Kohli: సోషల్ మీడియాలో తనపై తప్పుడు వార్తలు రాస్తున్నారని ఒక జాతీయ పత్రిక మీద కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేసాడు. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లోనే కాదు సోషల్ మీడియాలో కూడా కింగే. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌క్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మిలియన్ల కొద్ది ఫాలోవర్లను సొంతం చేసుకున్న కోహ్లీ.. ఎప్పుడెప్పుడు ఆన్‌లైన్‌లోకి వస్తాడా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.

అయితే తాజాగా కోహ్లీ ఇంస్టాగ్రామ్‌లో చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక జాతీయ పత్రిక మీద అసహనం ప్రదర్శిస్తూ కోహ్లీ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. తన మీద వస్తున్న ఫేక్ న్యూస్ చూసి ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీకి ఏకంగా 256 మంది మిలియన్ల ఫాలోవర్లుతో దేశంలోనే ప్రధమ స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో ఇన్‌స్టా ద్వారా కోహ్లీ రూ.11.45 కోట్లు సంపాదిస్తాన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇందులో నిజం లేదని కోహ్లీ క్లారిటీ ఇచ్చేసాడు. అయితే ప్రస్తుతం ఫామ్‌హౌస్‌లో విరాట్ కోహ్లీ క్రికెట్ పిచ్‌ను నిర్మించాలనుకుంటున్నాడని ఓ జాతీయ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ వార్త విని షాకైన విరాక్ కోహ్లీ.. సోషల్ మీడియా వేదికగా ఇది తప్పుడు వార్త అని చెప్పుకొచ్చాడు. ”నేను చిన్నప్పటినుంచి చదివిన వార్తపత్రిక కూడా నకిలీ వార్తలను ప్రచురించడం ప్రారంభించింది” అంటూ కోహ్లీ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో తెలియజేశాడు.

నకిలీ వార్తకు సంబంధించిన సదరు న్యూస్ పేపర్ క్లిప్పింగ్‌ను జత చేశాడు. విరాట్ కోహ్లీ, అతని సతీమణి అనుష్క శర్మ 2022లో ముంబైకి సమీపంలోని ఖరీదైన అలీబాగ్‌ ప్రాంతంలో రూ. 19.24 కోట్లు పెట్టి సుమారు 8 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ స్థలంలో విలాసవంతమైన ఫామ్‌హౌస్‌ నిర్మిస్తున్నారు.