World Cup: ఇద్దరి ఫేవరెట్ ఒకటే గ్రౌండ్ ఆరోజు మాత్రం మెరుపులు కన్ఫామ్
ప్రస్తుత భారత క్రికెట్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మోస్ట్ పాపులర్ క్రికెటర్లు. వీరికి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. గత 15 ఏళ్లుగా తమ బ్యాటింగ్ తో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించారు. ఇక వీరిద్దరూ కలిసి ఆడితే ప్రత్యర్థికి చుక్కలు కనబడాల్సిందే.

Virat Kohli, Rohit Sharma say it's great to play ODI World Cup cricket at home after 12 years
పరిమిత ఓవర్ల క్రికెట్ లో వీరిద్దరూ ఎన్నో సార్లు 100 కు పైగా భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఇక ఐపీఎల్ లో రోహిత్ ముంబై ఇండియన్స్ కి ఆడితే, విరాట్ ఆర్సీబీకి ఆడతాడు. ఆ గ్రౌండ్స్ లో వీరికుండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో కూడా వీరు తమ సొంత మైదానాన్ని ఫేవరేట్ అని చెప్పుకొచ్చారు. అయితే వీరిద్దరూ కామన్ గా ఒకే గ్రౌండ్ మీద మనసు పారేసుకున్నారు. భారత్ వేదికగా అక్టోబర్ లో వరల్డ్ కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. 12 ఏళ్ళ తర్వాత స్వదేశంలో టీమిండియా మరోసారి వరల్డ్ కప్ అవడబోతుంది. దీంతో ఈ సారి ఎలాగైనా కప్ కొట్టాలని రోహిత్ సేన గట్టి పట్టుదలగా ఉంది.
ఇక తాజాగా ఐసీసీ ఈ వరల్డ్ కప్ కి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఈ మ్యాచులు జరగనున్నాయి. ఇదిలా ఉండగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వరల్డ్ కప్ మ్యాచుల గురించి స్పందించారు. అయితే ఇద్దరూ కూడా ముంబైలో మ్యాచ్ లు ఆడేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. “ఇండియాలో ముంబై గ్రౌండ్ నాకు చాలా ఇష్టం. వరల్డ్ కప్ లో ఇక్కడ మ్యాచ్ ఆడేందుకు ఎంతగానో ఎదురు చూస్తున్నాను” అని తెలిపాడు. రోహిత్ శర్మది ముంబై పేరు చెప్పడంలో పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా.. కోహ్లీ కూడా ముంబైలో మ్యాచ్ ఆడాలని తన మనసులో మాట తెలియజేశాడు.
“స్వదేశంలో వరల్డ్ కప్ ఆడటం నాకు చాలా ప్రత్యేకం. ప్రతీ క్రికెటర్ తన జీవితంలో ఇలాంటి రోజు కోసం ఎదురు చూస్తాడు. ముంబైలో వరల్డ్ కప్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నా. 2011 వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో జరిగిన ప్రతీ సన్నివేశాన్ని నేనింకా మర్చిపోలేదు. మరోసారి అక్కడ వరల్డ్ కప్ మ్యాచ్ ఆడాలని అనుకుంటున్నా.’ అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇక ఈ వరల్డ్ కప్ లో టిమిండియా తమ స్థాయికి తగ్గట్టుగా ఆడితే సెమీ ఫైనల్ కి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అదే జరిగితే ఒక సెమీఫైనల్ మ్యాచ్ ముంబైలో జరగనుంది. ఈ రకంగా చూసుకుంటే కోహ్లీ, రోహిత్ అనుకున్నట్లుగా ముంబై గ్రౌండ్ లో ఆడాల్సివస్తే.. చెలరేగిపోవడం గ్యారంటీ.