Virat Kohli: రికార్డుల మోత మోగించిన కోహ్లీ.. సచిన్ రికార్డు బద్దలు..!

సచిన్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీలు (49) రికార్డును దాటేశాడు. అది కూడా సచిన్ సమక్షంలోనే కావడం విశేషం. ఈ సెంచరీ ద్వారా వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు కోహ్లీ. అంతేకాదు.. ఈ మ్యాచ్ ద్వారా కోహ్లీ మరిన్ని రికార్డులు కూడా నెలకొల్పాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 15, 2023 | 05:57 PMLast Updated on: Nov 15, 2023 | 5:57 PM

Virat Kohli Scores 50th Odi Century Breaks Sachin Tendulkars Record

Virat Kohli: కింగ్ కోహ్లీ (Virat Kohli) క్రికెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచ కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌లో వన్డేల్లో 50వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సచిన్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీలు (49) రికార్డును దాటేశాడు. అది కూడా సచిన్ సమక్షంలోనే కావడం విశేషం. ఈ సెంచరీ ద్వారా వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు కోహ్లీ. అంతేకాదు.. ఈ మ్యాచ్ ద్వారా కోహ్లీ మరిన్ని రికార్డులు కూడా నెలకొల్పాడు.

ICC WORLD CUP: ఆల్ ది బెస్ట్ టీమిండియా.. మ్యాచ్ విన్నర్ మనమే అంటున్న టాలీవుడ్ స్టార్..

వన్డేల్లో ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్ రికార్డ్ కూడా కోహ్లీ బ్రేక్ చేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్ ద్వారా 13,704కుపైగా రన్స్‌ సాధించిన కోహ్లీ.. అంతకుముందు మూడో స్థానంలో ఉన్న రికీ పాంటింగ్ రికార్డ్ బ్రేక్ చేశాడు. దీంతో విరాట్ మూడో స్థానానికి చేరాడు. కోహ్లీ కంటే ముందు.. 18426 రన్స్‌తో సచిన్ టెండూల్కర్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఆ తర్వాత 14234 రన్స్‌తో శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర రెండో స్థానంలో ఉన్నాడు. వీరి తర్వాత వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు.. ఒక వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. అంతకుముందు 2003 ప్రపంచ కప్‌లో సచిన్ 673 పరుగులు సాధించి మొదటి స్థానంలో ఉండగా.. ఈ రికార్డును కూడా కోహ్లీ బ్రేక్ చేశాడు.

ఒక ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో కోహ్లీ మొదటి స్థానంలో, సచిన్ రెండో స్థానంలో, ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ హెడెన్ 659 పరుగులతో మూడో స్థానంలో, రోహిత్ శర్మ 678 పరుగులతో నాలుగో స్థానంలో, డేవిడ్ వార్నర్ 647 పరుగులతో ఐదో స్థానంలో నిలిచారు. ఇక.. కోహ్లీకి వన్డేలు, టెస్టులు, టీ20లు కలిపి 80 సెంచరీలున్నాయి. కాగా.. తన రికార్డులను బద్దలుకొట్టే ఆటగాడు విరాట కోహ్లీనే అన్న క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ మాటలను నిజం చేస్తూ విరాట్‌ ఈ రోజు కొత్త రికార్డులు నెలకొల్పాడు.