VIRAT KOHLI: కోహ్లీ ఫ్యాన్స్‌కు షాక్.. ఇంగ్లాండ్‌తో తర్వాతి టెస్టులకూ కోహ్లీ దూరం
వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్ట్‌లు ఆడని కోహ్లీ.. మూడు, నాలుగో టెస్ట్‌కు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదని సమాచారం. చివరి మూడు టెస్ట్‌ల్లో బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించాల్సి ఉంది.

VIRAT KOHLI: ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్ట్‌లు ఆడని కోహ్లీ.. మూడు, నాలుగో టెస్ట్‌కు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదని సమాచారం. చివరి మూడు టెస్ట్‌ల్లో బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించాల్సి ఉంది.
Varsha Bollamma: మళ్లీ కలవనేలేదు.. బెల్లంకొండ హీరోతో పెళ్లి..!
తన సతీమణి అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో తొలి రెండు టెస్ట్‌లకు కోహ్లీ దూరంగా ఉన్నాడు. ప్రసవ సమయంలో ఆమె పక్కన ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాడు. బీసీసీఐ అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు మిగిలిన మ్యాచ్ లలో కూడా ఆడే అవకాశం లేనట్టే. తన రెండో బిడ్డకు సంబంధించిన విషయాలను కోహ్లీ గోప్యంగా ఉంచాడు. ఎక్కడా కూడా ఈ విషయాన్ని ప్రకటించలేదు. అంతేకాకుండా అనుష్క శర్మ గర్భవతి అనే విషయం తెలియకుండా ఈ జోడీ చాలా జాగ్రత్తలు తీసుకుంది.కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నాడనే విషయాన్ని అతని సన్నిహితుడు, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ అభిమానులకు తెలిపాడు.
ప్రస్తుతం కోహ్లీ తన లీవ్‌ను పొడిగించుకున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే.. ఆఖరి టెస్ట్‌కు కూడా దూరంగా ఉండి నేరుగా ఐపీఎల్‌లో బరిలోకి దిగే అవకాశం కూడా ఉందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఓడిన భారత్ తర్వాత రెండో టెస్ట్ గెలిచి లెక్క సరి చేసింది. మూడో టెస్ట్ ఫిబ్రవరి 15 నుంచి మొదలు కానుంది.