VIRAT KOHLI: అమెరికా పిచ్‌లకు సరిపోనా.. టీ ట్వంటీ వరల్డ్ కప్‌పై కోహ్లీ కామెంట్స్
మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా టీ20 క్రికెట్ ఆటను ప్రమోట్ చేయడానికి కేవలం తన పేరు మాత్రమే వాడుతున్నారన్నాడు. తనలో ఆట ఇంకా మిగిలే ఉందంటూ విమర్శకులకు చురకలు అంటించాడు.
VIRAT KOHLI: ఐపీఎల్‌లో కోహ్లీ మరోసారి తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టేశాడు. 49 బంతుల్లోనే 77 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా టీ20 క్రికెట్ ఆటను ప్రమోట్ చేయడానికి కేవలం తన పేరు మాత్రమే వాడుతున్నారన్నాడు.
Donald Trump: సంపదలో దూసుకెళ్లిన ట్రంప్.. ఎన్నివేల కోట్లు పెరిగిందంటే..
తనలో ఆట ఇంకా మిగిలే ఉందంటూ విమర్శకులకు చురకలు అంటించాడు. ఈ ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కు విరాట్ కోహ్లిని తప్పించే యోచనలో బీసీసీఐ ఉందని ఇటీవల వార్తలు వచ్చాయి. అమెరికా పిచ్‌లు కోహ్లీ ఆటకు సరిపోవని, పూర్తి యువ జట్టునే పంపించాలనుకుంటున్నట్టు అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. దీనిపై పరోక్షంగా స్పందించిన కోహ్లీ.. తనలో షార్ట్ ఫార్మాట్‌కు తగ్గట్టు ఆడే సత్తా ఇంకా తగ్గలేదన్నాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత కోహ్లీ ఫ్యాన్స్ కూడా విమర్శకులకు కౌంటర్ ఇస్తున్నారు. ఛేజింగ్ కింగ్‌గా పేరున్న విరాట్‌నే వరల్డ్ కప్‌కు తప్పిస్తారా.. అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంతకంటే వేగంగా ఆడాలా అంటూ కౌంటర్ ఇస్తున్నారు.
ఒకవేళ ఐపీఎల్ 17వ సీజన్ మొత్తం కోహ్లీ జోరు ఇలాగే కొనసాగితే బీసీసీఐ తన ఆలోచన మార్చుకోవాలేమోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా కోహ్లీ చివరిసారిగా 2022 టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడాడు.