VIRAT KOHLI: ఆర్సీబీని వదిలేయాలనుకున్న విరాట్.. ఎందుకో తెలుసా..?
ఐపీఎల్‌లో అత్యధిక క్రేజ్ ఉన్న జట్లలో ఆర్‌సీబీ ఒకటి. ఇక ఆ టీమ్‌లో అందరి దృష్టి రన్ మిషన్ విరాట్‌పైనే ఉంటుంది. ఐపీఎల్ ఆరంభం నుంచి RCBకి తప్ప మరే జట్టుకు ఆడని విరాట్‌ను ఐపీఎల్ వేలంలోకి రావాలని కొన్ని ఫ్రాంచైజీలు కోరాయి.
VIRAT KOHLI: ఐపీఎల్ ఆరంభం నుంచి ఆర్‌సీబీకి తప్పితే మరే జట్టుకు ఆడని ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ. అలాంటి విరాట్ కూడా ఒకానొక దశలో బెంగళూరు జట్టును వదిలేయాలని అనుకున్నాడట. గతేడాది ఐపీఎల్ సమయంలో విరాట్ చేసిన చిట్‌చాట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇప్పుడు ఐపీఎల్‌లో రిటెన్షన్, రిలీజ్ అయిపోయింది. ఆటగాళ్లను ఫ్రాంచైజీలు ఒకదాని నుంచి మరొకటి కొనుగోలు చేస్తున్నాయి. గుజరాత్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన హార్దిక్ పాండ్యను ముంబయి సొంతం చేసుకుంది.
ASSEMBLY ELECTIONS: అసెంబ్లీ ఎన్నికలు.. విద్యా సంస్థలకు సెలవులు..
అలాగే ముంబయి నుంచి కామెరూన్ గ్రీన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. ఇలాంటి సమయంలో గతంలో విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఐపీఎల్‌లో అత్యధిక క్రేజ్ ఉన్న జట్లలో ఆర్‌సీబీ ఒకటి. ఇక ఆ టీమ్‌లో అందరి దృష్టి రన్ మిషన్ విరాట్‌పైనే ఉంటుంది. ఐపీఎల్ ఆరంభం నుంచి RCBకి తప్ప మరే జట్టుకు ఆడని విరాట్‌ను ఐపీఎల్ వేలంలోకి రావాలని కొన్ని ఫ్రాంచైజీలు కోరాయి. అయితే విరాట్ కూడా ఒకదశలో బెంగళూరును వదిలేద్దామని నిర్ణయించుకున్నాని చెప్పాడు. ఒక రోజు జీవితమంటే ఏంటా అనే ఆలోచన వచ్చి ఆగిపోయానని తెలిపాడు. మనం ఉన్నా లేకపోయినా రోజులు జరిగిపోతూనే ఉంటాయని.. ప్రతి ఒక్కరికి ఇంతకాలం అని రాసిపెట్టి ఉంటుందని గతంలో చిట్‌చాట్‌లో అన్నాడు కోహ్లీ.
ట్రోఫీలు గెలిచిన గొప్ప ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు కానీ.. ఎక్కడికైనా వెళ్తే ఇతను ఐపీఎల్ ఛాంపియన్ లేదా వరల్డ్ కప్ ఛాంపియన్ అని సంబోధించరని చెప్పుకొచ్చాడు. ఆర్‌సీబీపై విధేయతగా ఉండటానికి మరో కారణం కూడా ఉందన్నాడు విరాట్. ట్రోఫీని అందించకపోయినా.. ఏ ఫ్రాంచైజీ కూడా ఇలా ఆటగాడిపై నమ్మకం ఉంచి మద్దతుగా నిలిచిన దాఖలాలు లేవన్నాడు. ఒక్కసారి కూడా ట్రోఫీని గెలవకపోయినా తమ పట్ల ఆర్‌సీబీ యాజమాన్యం చూపించిన విశ్వాసం మరిచిపోలేమని గుర్తుచేసుకున్నాడు. తొలి మూడేళ్లు.. తానప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రోజులు. అలాంటి సమయంలోనూ ఫ్రాంచైజీ తనకు ఎన్నో అవకాశాలను కల్పించిందన్నాడు. మరే ఇతర జట్టులోనూ తనకు ఇలాంటి మద్దతు లభిస్తుందని అనిపించలేదన్నాడు విరాట్ కోహ్లీ.