Virat Kohli: ఆసియా కప్‌లో విరాట్ కోహ్లీకే కెప్టెన్సీ..?

భారత జట్టు 6 సంవత్సరాల తర్వాత తొలి సారిగా టీ20 సిరీస్‌ను కోల్పోయింది. అలాగే దాదాపు 17 సంవత్సరాల తర్వాత వెస్టిండీస్ జట్టు భారత్‌పై సిరీస్‌ను గెలుచుకుంది. దీంతో టీమిండియా అభిమానులు తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 14, 2023 | 04:00 PMLast Updated on: Aug 14, 2023 | 4:00 PM

Virat Kohli Will Be Indias Captain For Asia Cup Rohit Sharma Replaced

Virat Kohli: భారత జట్టు వెస్టిండీస్ పర్యటన ముగిసింది. పర్యటనలో భాగంగా వెస్టిండీస్‌తో ఆడిన టెస్ట్ సిరీస్‌, వన్డే సిరీస్‌లను భారత్ సొంతం చేసుకుంది. అయితే టీ20 సిరీస్‌లో మాత్రం హర్దిక్ సేన చేతులెత్తేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్ కోల్పోయే దశలో ఉన్న భారత జట్టును తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో యువ ఆటగాళ్లు ఆదుకున్నారు. కానీ ఆదివారం జరిగిన 5వ టీ20 మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ మినహా మిగిలినవారంతా చేతులెత్తేశారు.

దీంతో భారత జట్టు 6 సంవత్సరాల తర్వాత తొలి సారిగా టీ20 సిరీస్‌ను కోల్పోయింది. అలాగే దాదాపు 17 సంవత్సరాల తర్వాత వెస్టిండీస్ జట్టు భారత్‌పై సిరీస్‌ను గెలుచుకుంది. దీంతో టీమిండియా అభిమానులు తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. అయితే వారి ఆగ్రహానికి ఆజ్యం పోసినట్లుగా ఉన్నాయి మ్యాచ్‌ ముగిసిన తర్వాత కెప్టెన్ హార్దిక్ మాటలు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టుపై వెస్టిండీస్ టీమ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది. మ్యాచ్ తర్వాత హార్దిక్ మాట్లాడుతూ ‘ఒక టీమ్‌గా మమ్మల్ని మేము ఛాలెంజ్ చేసుకోవాలనే ఆలోచనతోనే ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నా. ఇవన్నీ కూడా కొత్త విషయాలు నేర్చుకునే మ్యాచులే. అడపాదడపా ఒక సిరీస్ కోల్పోవడం సమస్యే కాదు. కానీ టార్గెట్ కోసం కమిట్మెంట్ చాలా ముఖ్యం.

ఒక్కోసారి ఓడిపోవడం కూడా మంచిదే’నని అన్నాడు. ఇలా సిరీస్ కోల్పోవడం సమస్యే కాదని హార్దిక్ అనడం అభిమానులకు నచ్చలేదు. ఈ మ్యాచులో పాండ్యా చేసిన బౌలింగ్ మార్పులు కూడా ఓటమికి కారణమనే విమర్శలు వస్తున్నాయి. దీంతో అటు టీమిండియా అభిమానులు, ఇటు నెటిజన్లు హార్దిక్‌ని ట్రోల్ చేస్తున్నారు.