Virat Kohli: కోహ్లీ ఐపీఎల్ ఆడటం డౌటే.. గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
రెండో సారి తండ్రి అవుతున్న సందర్భంగా కోహ్లి జట్టుకు దూరమవ్వడంపై సునీల్ గవాస్కర్ పరోక్షంగా అసహనం వ్యక్తం చేశాడు. ఏవో కారణాలతో కోహ్లి ఆడట్లేదనీ, ఐపీఎల్ కూడా ఆడడేమోనంటూ వ్యాఖ్యానించాడు.

Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌లో కోహ్లీ ఆడతాడా లేదా అనేది సందిగ్ధంగా మారింది. ఈ నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లి అందుబాటులో ఉండటం అనుమానమేనని చెప్పాడు. రెండో సారి తండ్రి అవుతున్న సందర్భంగా కోహ్లి జట్టుకు దూరమవ్వడంపై సునీల్ గవాస్కర్ పరోక్షంగా అసహనం వ్యక్తం చేశాడు.
Jr NTR: దేవర మూవీతో ఎన్టీఆర్‌కు అరుదైన రికార్డు ఖాయమా?
ఏవో కారణాలతో కోహ్లి ఆడట్లేదనీ, ఐపీఎల్ కూడా ఆడడేమోనంటూ వ్యాఖ్యానించాడు. అయితే కోహ్లీకి కొందరు మద్ధతుగా నిలిస్తే.. మరికొందరు గవాస్కర్ వ్యాఖ్యలతో ఏకీభవించారు. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. మ్యాచ్‌కు ఇంకా చాలా సమయం ఉండగా.. ప్రస్తుతం కోహ్లి లండన్‌లోనే ఉన్నాడు. మరోవైపు ఆర్‌సీబీ మాత్రం కోహ్లీ ఆడడంపై కాన్ఫిడెంట్‌గానే కనిపిస్తోంది. ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభానికి ముందు ఏర్పాటు చేసే సన్నాహక శిబిరంలో కోహ్లి పాల్గొనవచ్చని ఆర్‌సీబీ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే జట్టుకు దూరమైన విరాట్ కోహ్లీ తొలిసారి సోషల్ మీడియాలో స్పందించాడు. మరో మ్యాచ్ మిగిలుండగానే ఇంగ్లండ్‌పై 3-1తో టీమిండియా సిరీస్ నెగ్గడంతో శుభాకాంక్షలు తెలిపాడు. సీనియర్లు లేకపోయినా యువ జట్టు చేసిన పోరాటాన్ని కొనియాడాడు.