Virat Kohli: కోహ్లీ జాతకం ఎలా ఉంది..? వరల్డ్ కప్ గెలిచే ఛాన్స్ ఉందా..?
మరికొద్ది రోజుల్లో ప్రపంచకప్ జరగబోతుండటంతో కోహ్లీ పాత్ర ఈసారి వరల్డ్ కప్‌లో కీలకం కానుంది. కోహ్లీ జాతకం ప్రకారం అతని భవిష్యత్తు ఎలా ఉంటుంది..? భారత జట్టు ప్రపంచకప్ గెలుస్తుందా..? అని స్పోర్ట్స్ ఏరియాలో కొత్త టాపిక్ ట్రెండింగ్‌లో నడుస్తోంది.
Virat Kohli: విరాట్ కోహ్లీ భారత క్రికెట్ జట్టును నడిపించడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన కీలక ఆటగాడు. తన అద్బుతమైన ఆటతీరుతో ఎన్నో రికార్డులను నెలకోల్పాడు ఈ స్టార్ క్రికెటర్. ఓడిపోయే మ్యాచ్‌లను కూడా ఒంటి చేత్తో గెలిపించిన హిస్టరీ.. సచిన్ టెండూల్కర్ తర్వాత విరాట్‌కే దక్కింది. మరికొద్ది రోజుల్లో ప్రపంచకప్ జరగబోతుండటంతో కోహ్లీ పాత్ర ఈసారి వరల్డ్ కప్‌లో కీలకం కానుంది.
కోహ్లీ జాతకం ప్రకారం అతని భవిష్యత్తు ఎలా ఉంటుంది..? భారత జట్టు ప్రపంచకప్ గెలుస్తుందా..? అని స్పోర్ట్స్ ఏరియాలో కొత్త టాపిక్ ట్రెండింగ్‌లో నడుస్తోంది. విరాట్ కోహ్లీ జాతకం ప్రకారం అతనిది మీన రాశి. అతను ఈ సంవత్సరం గ్రహాల కారణంగా మంచి ఫామ్‌లో ఉంటాడు. తద్వారా తదుపరి మ్యాచ్‌ల్లోనూ అద్భుత ప్రదర్శన కనబరుస్తాడు. ఈ స్టార్ క్రికెటర్ జీవితంలో సంతోషం మెండుగానే ఉంటుంది. విరాట్ కోహ్లీ జాతకంలో అదృష్టాన్ని సూచించే నిర్దిష్ట రాజయోగాలు కూడా ఉన్నాయి. అంటూ, ప్రెడిక్షన్ స్పెషలిస్టులు ఫ్యాన్స్‌లో ధీమాను నింపే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం విరాట్ జాతకంలో గ్రహాల స్థితి చాలా బాగుంది. విరాట్ కోహ్లీ జాతకం ప్రకారం తదుపరి మ్యాచ్‌లలో అతని హైప్ ఎక్కువగా ఉంటుంది. ఈ స్టార్ క్రికెటర్ జాతకం ప్రకారం చూసుకుంటే ఇండియా జట్టు ప్రపంచకప్ గెలిచే అవకాశం చాలా ఎక్కువగా ఉందని ఆస్ట్రాలజర్స్ కొందరు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.