Virat Kohli: రింకూ సింగ్‌కు కోహ్లీ సర్‌ప్రైజ్ గిఫ్ట్..
మ్యాచ్ అనంతరం రింకూ సింగ్ బ్యాటును కోహ్లి పరిశీలించడం చర్చనీయాంశంగా మారింది. రింకూ బ్యాటును అనుమానించాడని కథనాలు కూడా వచ్చాయి. అయితే రింకూ బ్యాటును కోహ్లి చెక్ చేయడానికి కారణం ఏంటో తర్వాత తెలిసింది.
Virat Kohli: బెంగుళూరు, కోల్‌కతా మ్యాచ్ అంటే ఓ మినీవార్‌లా సాగుతుందనుకున్న ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. మునపటిలా కవ్వింపులు ఏమీ లేవు. ఆటగాళ్లు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ సరదాగా మాట్లాడుకున్నారు. గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లి కూడా కలిసిపోయారు. మరోవైపు మ్యాచ్ అనంతరం రింకూ సింగ్ బ్యాటును కోహ్లి పరిశీలించడం చర్చనీయాంశంగా మారింది. రింకూ బ్యాటును అనుమానించాడని కథనాలు కూడా వచ్చాయి.
CONGRESS VS BJP: మాటలయుద్ధం.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తారా.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ..
అయితే రింకూ బ్యాటును కోహ్లి చెక్ చేయడానికి కారణం ఏంటో తర్వాత తెలిసింది. రింకూ సింగ్‌కు స్పెషల్ బ్యాటును గిఫ్ట్‌గా ఇవ్వడానికి కోహ్లి అలా చేశాడు. కోహ్లి తనకి కీలకమైన సలహాలు ఇచ్చాడని, అంతేగాక బ్యాటును గిఫ్ట్‌గా ఇచ్చాడని రింకూ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపాడు. ఈ విషయాన్ని కేకేఆర్ కూడా తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఐపీఎల్‌లో సత్తాచాటి టీమిండియాలో చోటు దక్కించుకున్న రింకూ సింగ్ నయా ఫినిషర్‌గా ప్రశంసలు పొందుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చిత్తుగా ఓడిపోయింది.
ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 182 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో కోల్‌కతా 16.5 ఓవరల్లో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్ ఓటమి నేపథ్యంలో ఆర్సీబీపై విమర్శలు ఎక్కువయ్యాయి.