Virat Kohli: విరాట్‌లా ఉన్నాడే.. ఎవరితడు..?
కార్తీక్‌కు, విరాట్‌కు చాలా పోలికలే ఉన్నాయి. ఏదో ముఖ కవళికలు కలవడం మాత్రమే కాదు. అతడి నడక, స్టయిల్, నవ్వు కూడా విరాట్‌నే పోలి ఉండటంతో అభిమానులు ఆశ్చర్యపడుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో అతడికి ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోయింది.

Virat Kohli: కార్తీక్ శర్మ.. అతడిని చూడగానే ‘ఏంటి విరాట్ కోహ్లిలా ఉన్నాడే!’ అని అనుకోని వాళ్లు ఉండరు. విరాట్ మాదిరి శరీరం, అతడిలాగే గడ్డం, నవ్వుతో సహా భారత క్రికెట్ స్టార్‌ని దించేశాడు కార్తీక్. చండీగఢ్‌కు చెందిన ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాడు. అతడు ఎక్కడికి వెళ్లినా అభిమానులు పొరబడి ఆటోగ్రాఫ్‌లు అడుగుతున్నారంటే కార్తీక్.. విరాట్‌ను ఎంతలా తలపిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. కార్తీక్‌కు, విరాట్‌కు చాలా పోలికలే ఉన్నాయి.
ఏదో ముఖ కవళికలు కలవడం మాత్రమే కాదు.. అతడి నడక, స్టయిల్, నవ్వు కూడా విరాట్‌నే పోలి ఉండటంతో అభిమానులు ఆశ్చర్యపడుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో అతడికి ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోయింది. కార్తీక్ బయటకు వస్తే చాలు కోహ్లీ వచ్చాడేమో అనుకుని వెంటపడుతున్నారట. విరాట్.. ప్లీజ్ ఆటోగ్రాఫ్ ఇవ్వండి.. ఫొటోలు కావాలి అని అడుగుతున్నారట. కానీ ఈ క్రేజ్‌ని అతడేమి సొమ్ము చేసుకోవాలని అనుకోవట్లేదు. వచ్చిన వాళ్లకు తాను విరాట్‌ని కానని ముందే చెప్పేస్తున్నాడు. అతడి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ఇప్పటికే 2.5 లక్షల మంది దాకా ఫాలో అవుతున్నారు. రోజురోజుకి ఫాలోవర్లు పెరిగిపోతున్నారు. కోహ్లిని పోలిన కోహ్లి గురించి తెలుసుకున్న కొన్ని సంస్థలు డాక్యుమెంటరీలు కూడా తీస్తున్నాయి. హ్యుమన్స్ ఆఫ్ బాంబే పేరిట కార్తీక్‌పై ఓ డాక్యుమెంటరీ నిర్మాణానికి సిద్ధమైంది.