Virat Kohli, Rohit Sharma : విరాట్ వైపే సపోర్ట్.. ప్రోమోలో రోహిత్ లేడు..?
విరాట్ కోహ్లీ (Virat Kohli) ఫ్యాన్స్, రోహిత్ శర్మ (Rohit Sharma) ఫ్యాన్స్ మధ్య మరోసారి వైరం బయటపడింది. ఇంతకుముందు వీరి మధ్య జగడం ఉన్నప్పటికీ మళ్లీ బట్టబయలైంది. వరల్డ్ కప్ లో టీమిండియా విజయాలపై స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన ప్రోమో తంటాలు తెచ్చిపెట్టింది. ఈ ప్రోమోలో ఎక్కువగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వరించిన ప్లేయర్స్ ను చూపించారు. అందులో కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడం ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.

Virat Kohli's fans and Rohit Sharmas fans have once again quarreled over Virats support Rohit is not in the promo..?
విరాట్ కోహ్లీ (Virat Kohli) ఫ్యాన్స్, రోహిత్ శర్మ (Rohit Sharma) ఫ్యాన్స్ మధ్య మరోసారి వైరం బయటపడింది. ఇంతకుముందు వీరి మధ్య జగడం ఉన్నప్పటికీ మళ్లీ బట్టబయలైంది. వరల్డ్ కప్ లో టీమిండియా విజయాలపై స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన ప్రోమో తంటాలు తెచ్చిపెట్టింది. ఈ ప్రోమోలో ఎక్కువగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వరించిన ప్లేయర్స్ ను చూపించారు. అందులో కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడం ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ సెంచరీ చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుపొందాడు. అయితే ప్రోమోలో అతను కనబడలేదు. అయితే స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన ప్రోమో చూశాక విరాట్ కోహ్లీ అభిమానులు ఆనందంగా ఉంటే.. రోహిత్ అభిమానులు మాత్రం ఆగ్రహంతో ఉన్నారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మకు వరల్డ్ కప్ ప్రోమో లో చోటు ఇవ్వలేదు. అటు షమీని కూడా ప్రోమోలో చేర్చారు. దాంతో రోహిత్ అభిమానులు స్టార్ స్పోర్ట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ కు కనీస గౌరవం కూడా ఇవ్వలేరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. షేమ్ స్టార్ స్పోర్ట్స్ అంటూ మండిపడుతున్నారు. స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో టీమిండియా ఓటమి ఎరుగని జట్టుగా దూసుకెళ్తుంది. టీమిండియా ఆడిన 8 మ్యాచ్ల్లో అన్నింటిలో గెలిచింది. అయితే ఈ విజయంలో ప్రతి ఒక్క ఆటగాడు కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆటగాళ్లు అదరగొట్టారు.