ఆకాశమే హద్దుగా విధ్వంసం విష్ణు వినోద్ ఊచకోత
కేరళ క్రికెట్ లీగ్ లో యువ క్రికెటర్లు అదరగొడుతున్నారు. జాతీయ జట్టు, ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడడమే లక్ష్యంగా దుమ్మురేపుతున్నారు. తాజాగా త్రిస్సూర్ టైటాన్స్ బ్యాటర్ విష్ణు వినోద్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
కేరళ క్రికెట్ లీగ్ లో యువ క్రికెటర్లు అదరగొడుతున్నారు. జాతీయ జట్టు, ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడడమే లక్ష్యంగా దుమ్మురేపుతున్నారు. తాజాగా త్రిస్సూర్ టైటాన్స్ బ్యాటర్ విష్ణు వినోద్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ సెంచరీ కొట్టాడు. కేవలం 32 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుని అరుదైన రికార్డును నెలకొల్పాడు. మొదట బ్యాటింగ్ కు దిగిన అలెప్పీ టీమ్ 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది. అలెప్పీ కెప్టెన్ మహ్మద్ అజాహరుద్దీన్ 58 బంతుల్లో 90 పరుగులు చేశాడు. ఛేజింగ్ లో విష్ణు వినోద్ దెబ్బకు మ్యాచ్ వన్ సైడ్ గా మారిపోయింది. పవర్ ప్లేలోనే జట్టు విజయాన్ని ఖాయం చేసేసాడు. విష్ణు వినోద్ సునామీ బ్యాటింగ్ తో కేవలం 12.4 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేసింది
ఎలాంటి బాల్స్ వేసినా విష్ణు వినోద్ బౌండరీ దాటించడమే లక్ష్యంగా ఆడేశాడు. ఓవరాల్ గా 45 బంతులు ఎదుర్కొని 17 సిక్సర్లు, 5 ఫోర్లతో 139 పరుగులు చేశాడు. విష్ణు వినోద్ ను ఐపీఎల్ 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్ 20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా అతడికి అవకాశం రాలేదు. ఇక 2021 ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీకి, 2022లో సన్ రైజర్స్ హైదరబాద్ టీమ్ కు ప్రాతినిధ్యం వహించాడు వినోద్. తాజా ఇన్నింగ్స్ తో వచ్చే మెగా వేలంలో అతనికి భారీ ధర పలికే ఛాన్సుంది.