Sanjay Bangar: 30 లక్షల మంది చూస్తుండగా.. ప్లేయర్ కోసం గొడవ
ల్‌రౌండర్ కోటాలో ఎంపికైన శార్దూల్ ఠాకూర్‌ను ఎందుకు తీసుకున్నారని నిలదీశాడు. వరల్డ్ కప్ టీంను ప్రకటించే సమయంలో చివర్లో టెయిలెండర్లు కూడా బ్యాటుతో కొద్దోగొప్పో రాణించాలని రోహిత్ అన్నాడు. అందుకే శార్దూల్ ఠాకూర్‌కు ఈ జట్టులో చోటు దక్కింది.

Sanjay Bangar: వరల్డ్ కప్ ఆడే టీంను బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టును చూసిన చాలా మంది పెదవి విరుస్తున్నారు. కొంత మంది ఆటగాళ్ల సెలెక్షన్‌ను తప్పుబడుతున్నారు. అదే సమయంలో వరల్డ్ కప్ హీరో, మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ఈ విషయంపై స్పందించాడు. వరల్డ్ కప్ టీం సెలెక్షన్‌పై మండిపడ్డాడు. ముఖ్యంగా ఆల్‌రౌండర్ కోటాలో ఎంపికైన శార్దూల్ ఠాకూర్‌ను ఎందుకు తీసుకున్నారని నిలదీశాడు. వరల్డ్ కప్ టీంను ప్రకటించే సమయంలో చివర్లో టెయిలెండర్లు కూడా బ్యాటుతో కొద్దోగొప్పో రాణించాలని రోహిత్ అన్నాడు.
అందుకే శార్దూల్ ఠాకూర్‌కు ఈ జట్టులో చోటు దక్కింది. అయితే అతని ఎంపిక చాలా విడ్డూరంగా ఉందని శ్రీకాంత్ అన్నాడు. టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌తో ఈ విషయంపై వాదనకు కూడా దిగాడీ మాజీ లెజెండ్. ఆల్‌రౌండర్‌గా శార్దూల్ తన సత్తా నిరూపించుకోలేదని కఠినంగా చెప్పాడు. శార్దూల్ నికరమైన బ్యాటర్ కాదని, అలాగని అతని బౌలింగ్ కూడా అంత గొప్పగా లేదని చెప్పాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత శార్దూల్ టాప్ స్కోర్ కేవలం 25 పరుగులే అని గుర్తుచేశాడు.
అంతేకాదు శార్దూల్ తన కెరీర్‌లో ఎన్నిసార్లు వన్డేల్లో పూర్తి కోటా పది ఓవర్లు వేశాడని ప్రశ్నించాడు. ఈ విషయంలో బంగర్, శ్రీకాంత్ గొడవ పడకుండా స్టార్ స్పోర్ట్స్ యాంకర్ అడ్డుకున్నాడు. అతని కన్నా అర్షదీప్ సింగ్ వంటి స్పెషలిస్ట్ పేసర్‌నో లేదంటే చాహల్ వంటి స్పిన్నర్‌నో టీంలో తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. డిబేట్ చివర్లో బంగర్ కూడా శ్రీకాంత్ అభిప్రాయంతో ఏకీభవించడం గమనార్హం.