Kohili: కోహ్లీతో కొట్లాట గంభీర్ సేవలకు లక్నో గుడ్ బై
లక్నో సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ టీమ్ మెంటార్‌గా సేవలందిస్తున్న టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌పై వేటు వేసేందుకు రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

Was the fight with Virat Kohli the reason for the attack on Gambhir
రెండు సీజన్లలో టీమ్ టైటిల్ అందుకోకపోవడంతో పాటు అనవసర గొడవలతో టీమ్ ప్రతిష్టను దిగజార్చడని లక్నో ఫ్రాంచైజీ ఓనర్స్ గంభీర్‌పై ఆగ్రహంగా ఉన్నట్లు టీమ్ అధికారి ఒకరు తెలిపినట్లు ఓ జాతీయ చానెల్ పేర్కొంది. ‘ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులతో పాటు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీతో గంభీర్ గొడవకు దిగడంపై లక్నో మేనేజ్‌మెంట్ కోపంగా ఉంది.
ఈ గొడవ కారణంగా లక్నో ఫ్రాంచైజీని అభిమానించేవారి కంటే ద్వేషించేవారి సంఖ్యనే ఎక్కువైంది. ఇది జట్టుకు తీరని నష్టం చేసింది. దాంతో టీమ్ ఓనర్స్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే సోషల్ మీడియా ప్రతినిధిని మార్చారు. గంభీర్‌పై వేటు వేయడంపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ విషయంపై గంభీర్‌ను కూడా వివరణ కోరనున్నారు. ఐపీఎల్ 2024 మినీ వేలం వరకు తుది నిర్ణయం తీసుకోనున్నారు.’అని సదరు అధికారి వెల్లడించాడు.