Wazhma Ayubi: వరల్డ్ కప్‌లో ఆఫ్గన్ మిస్టరీ గర్ల్.. ఇండియాకే మద్దతు
మ్యా చ్‌లు జరిగిన ప్రతి చోటా తన దేశానికి చెందిన జాతీయ జెండాతో దర్శనం ఇచ్చింది. ఇంతకాలం ఆఫ్గనిస్తాన్‌కు మద్దతు ఇచ్చిన ఈ భామ ఇప్పుడు ఇండియాకు తన సపోర్ట్ ఇస్తున్నట్లు తెలిపింది.

Wazhma Ayubi: సోషల్ మీడియాలో సెన్సేషన్, ఆఫ్గనిస్తాన్ మిస్టరీ గర్ల్ వాజ్మా అయూబీ (Wazhma Ayoubi). ఇటీవలి వరల్డ్ కప్ సందర్భంగా ఆఫ్గనిస్తాన్‌కు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో ఫేమస్ అయింది. ఆఫ్గనిస్తాన్ జట్టు ఎక్కడ ఆడినా ఆ టీమ్ కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ క్రేజ్ సంపాదించుకుంది.
మ్యా చ్‌లు జరిగిన ప్రతి చోటా తన దేశానికి చెందిన జాతీయ జెండాతో దర్శనం ఇచ్చింది. ఇంతకాలం ఆఫ్గనిస్తాన్‌కు మద్దతు ఇచ్చిన ఈ భామ ఇప్పుడు ఇండియాకు తన సపోర్ట్ ఇస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఆఖరి అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ కప్ ఫైనల్ జరగబోతుంది. కాగా, తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి నెట్టింట్లో సెన్సేషన్ గా మారారు. వరల్డ్ కప్ ఫైనల్‌లో వాజ్మా అయూబీ ఇప్పుడు ఎవరికి మద్దతు ఇస్తుందోననే ఉత్కంఠకు తెర దించింది. ట్విట్టర్ వేదికగా భారత జట్టుకు చెందిన విరాట్ కోహ్లీ నెంబర్ తో కూడిన జెర్సీని ధరించింది ఈ లవ్లీ గర్ల్. ప్రస్తుతం దుస్తుల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతోంది వాజ్మా అయూబీ.
ఆఫ్గనిస్తాన్‌కు చెందిన భామ అయినప్పటికీ.. ఇండియాకు మద్దతు ఇస్తోంది. ఆమె ఆఫ్గన్‌లో పుట్టినప్పటికీ అమెరికాలో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ప్రస్తుతం దుబాయ్‌లో వ్యాపారం చేస్తోంది. కాగా, ప్రస్తుతం ఈ మిస్టరీ గర్ల్ ఇండియాలోనే ఉంది. వరల్డ్ కప్ ఫైనల్‌కు హాజరయ్యే అవకాశం ఉంది. సెమీ ఫైనల్ మ్యాచులో కూడా స్టేడియంలో కనిపించింది. ఇక ఆదివారం నాటి మ్యాచులో ఇండియాకు మద్దతు తెలపడం ఖాయంగా ఉంది.