ఒక్క ఫోర్ లేదు..అన్నీ సిక్సర్లే.. హెట్‌మెయిర్ వరల్డ్‌ రికార్డు

కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో రికార్డులు హోరెత్తుతున్నాయి. తాజాగా వెస్టిండీస్ హిట్టర్ హెట్ మెయిర్ దుమ్మురేపాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 5, 2024 | 03:40 PMLast Updated on: Sep 05, 2024 | 3:40 PM

West Indies Hitter Het Myer World Record

కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో రికార్డులు హోరెత్తుతున్నాయి. తాజాగా వెస్టిండీస్ హిట్టర్ హెట్ మెయిర్ దుమ్మురేపాడు. విధ్వంసకర బ్యాటింగ్ లో ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. అమెజాన్ వారియర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ విండీస్ క్రికెటర్ సెయింట్ కీట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో 39 బంతుల్లో 91 పరుగులు చేశాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో ఒక్క ఫోర్ కూడా కొట్టకుండా పదికి పైగా సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో 11 సిక్స్‌లు బాదిన హెట్‌మెయిర్ కనీసం ఒక్క ఫోరు కూడా కొట్టలేదు. అంతకుముందు ఫోరు కూడా లేకుండా అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు ఇంగ్లండ్‌ ఇంగ్లండ్ ఆటగాడు రికీ వెసెల్స్ పేరిట ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును హెట్ మెయిర్ బ్రేక్ చేశాడు.