Lloyd: మొట్టమొదటిసారి ఐపిఎల్ కు మద్దతు.. విండీస్ దిగ్గజం చెప్తుంది వాళ్ళు వింటున్నారా?
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్లో టీమిండియా ఓటమికి ఐపీఎల్ కారణమంటూ వస్తున్న విమర్శల నేపథ్యంలో విండీస్ దిగ్గజ క్రికెటర్ క్లైవ్ లాయిడ్ స్పందించాడు.

West Indies legendary cricketer Clive Lloyd has responded to the criticism that IPL is the reason for Team India's defeat in the World Test Championship 2023 final
ఈ విషయంలో లాయిడ్ ఐపీఎల్ ఆడే క్రికెటర్లకు మద్దతుగా నిలిచాడు. అంతర్జాతీయ వేదికపై క్రికెటర్లు విఫలం కావడాన్ని ఐపీఎల్‌తో ముడిపెట్టడం సమంజసంకాదని అన్నాడు. ఆటగాళ్లకు దేశం కంటే డబ్బే ముఖ్యమని అనే వాళ్లు అర్దంపర్దం లేని వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికాడు. ఆటగాళ్లు దాదాపు 10 నెలల పాటు దేశం తరఫున ఆడుతున్నారు.. అలాంటప్పుడు రెండు నెలల పాటు ఐపీఎల్ ఆడి నాలుగు డబ్బులు వెనకేసుకుంటే తప్పేంటని ప్రశ్నించాడు.
మైఖేల్ జోర్డన్ లాంటి బాస్కెట్‌బాల్ ప్లేయర్లు.. రొనాల్డో, మెస్సీ లాంటి ఫుట్‌బాలర్‌లు మిలియన్ల కొద్ది డబ్బు సంపాదిస్తున్నప్పుడు, క్రికెటర్లు ఐపీఎల్ ఆడి డబ్బు సంపాదిస్తే తప్పేంటి అని ప్రశ్నించాడు. ప్రపంచవ్యాప్తంగా అందరు ఆటగాళ్లు పాల్గొనేలా ఐపీఎల్‌కు ప్రత్యేక విండోను ఏర్పాటు చేయాలని సూచించాడు. కాగా, క్లైయివ్ లాయిడ్ తొలి రెండు వన్డే ప్రపంచకప్‌లలో వెస్టిండీస్‌ను విజేతగా నిలిపిన కెప్టెన్ అన్న విషయం తెలిసిందే.