Mahendra Singh Dhoni : బయట కూర్చున్నవాళ్ళకి ఏం తెలుసు ? ధోనీ లేట్ గా బ్యాటింగ్ కు వచ్చేది అందుకే
ఐపీఎల్ (IPL) 17వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) చివరిలో బ్యాటింగ్‌కు రావడంపై చర్చ జోరుగా సాగుతోంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆలస్యంగా ధోనీ బరిలోకి దిగడంపై మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ విమర్శించారు.
ఐపీఎల్ (IPL) 17వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) చివరిలో బ్యాటింగ్‌కు రావడంపై చర్చ జోరుగా సాగుతోంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆలస్యంగా ధోనీ బరిలోకి దిగడంపై మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ విమర్శించారు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ కాస్త ముందుగా బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే చెన్నై మెరుగైన స్కోరు సాధించేదని వీరి అభిప్రాయ పడ్డారు. మరీ చివర్లో ధోనీ బ్యాటింగ్‌కు రావడం వల్ల సీఎస్కేకు ఎలాంటి ఉపయోగం లేదని తేల్చేశారు. అయితే ఆలస్యంగా ధోనీ బ్యాటింగ్‌కు రావడానికి గాయమే కారణమని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ధోనీ మైదానంలో ఎక్కువసేపు పరిగెత్తలేడని తెలుస్తోంది.
ధోనీ (Dhoni) కాలి గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల అతను స్వేచ్ఛగా కదలలేకపోతున్నాడని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఈ సీజన్ లో మందులు తీసుకుంటూ, నొప్పిని తగ్గించుకుంటూ పరిగెత్తుతున్నాడని చెబుతున్నారు.చెన్నై సెకండ్ ఛాయిస్ వికెట్ కీపర్ డెవాన్ కాన్వే గాయంతో ఈ సీజన్‌కు దూరమయ్యాడు. దీంతో మరో మార్గం లేక ధోనీ గాయంతోనే ఆడుతున్నాడని చెబుతున్నారు. పేర్కొన్నారు. ధోనీని విమర్శించే వాళ్లకు అతను ఏం త్యాగం చేస్తున్నాడో తెలియదని సీఎస్కే అధికారి ఒకరు తెలిపారు. కాగా, గత సీజన్‌లోనూ ధోనీ మోకాలి గాయంతోనే ఆడాడు.