Kohli : కోహ్లీకి ఏమైంది…?
టీమిండియా (Team India) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఇంగ్లాండ్ (England) తో టెస్టు సిరీస్ మొత్తానికీ దూరమయ్యాడు. ఒక సిరీస్‌కు దూరమవడం 13 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో కోహ్లీ (Kohli) కి ఇదే తొలిసారి. కెరీర్ ఆరంభం నుంచే ఆటకే అత్యంత ప్రాధాన్యతనిచ్చే విరాట్ ఇంగ్లండ్ సిరీస్‌కు అందుబాటులో లేకపోవడాన్ని అభిమానులు జర్ణించుకోలేకపోతున్నారు.
టీమిండియా (Team India) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఇంగ్లాండ్ (England) తో టెస్టు సిరీస్ మొత్తానికీ దూరమయ్యాడు. ఒక సిరీస్‌కు దూరమవడం 13 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో కోహ్లీ (Kohli) కి ఇదే తొలిసారి. కెరీర్ ఆరంభం నుంచే ఆటకే అత్యంత ప్రాధాన్యతనిచ్చే విరాట్ ఇంగ్లండ్ సిరీస్‌కు అందుబాటులో లేకపోవడాన్ని అభిమానులు జర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే కోహ్లి గాయపడి మ్యాచ్‌లకు దూరమైన సందర్భాలు కూడా తన కెరీర్‌లో లేవు. నామమాత్రపు మ్యాచ్‌ల్లో ఇతరులకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో తప్ప అతడు బెంచ్‌కు కూడా ఎప్పుడూ పరిమితం కాలేదు. అన్నింటికీ మించి క్రికెటర్‌గా మారడంలో అతడు ఎదుర్కొన్న పరిస్థితులు యువక్రికెటర్లకు ఖచ్చితంగా స్ఫూర్తిని ఇచ్చేవే. 17 ఏళ్ల వయస్సులో తండ్రి ప్రేమ్ కోహ్లి మరణించిన దుఃఖాన్ని దిగమింగుకుని కూడా మైదానంలో గొప్పగా పోరాడాడు.
2006 డిసెంబర్ 18వ తేదీన.. 90 పరుగులు చేసి జట్టును కాపాడిన తర్వాత.. తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. క్రికెట్‌పై కోహ్లికి ఉన్న అంకితభావానికి ఇది నిదర్శనం. ఇక మైదానంలో కోహ్లి దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి స్టార్ ప్లేయర్ వ్యక్తిగత కారణాలతో సిరీస్ మొత్తానికి దూరమవ్వడం అందరికి పెద్ద షాకే. మరోవైపు రెండో సారి తండ్రి కాబోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది క్రికెట్ అభిమానులకు రుచించట్లేదు. దీంతో కొందరు కోహ్లి, అతడి భార్య అనుష్క శర్మ (Anushka Sharma) పై విమర్శలు మొదలుపెట్టారు. 2021 ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు అనంతరం కోహ్లి వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమయ్యాడు. తొలిసారి తండ్రి కాబోతున్న క్షణంలో తన భార్య అనుష్కతో కలిసి ఉండాలని తప్పుకున్నాడు. ఇప్పుడు మరోసారి కోహ్లి బ్రేక్ తీసుకోవడంతో అతడి భవితవ్వంపై సందేహాలు వస్తున్నాయి. 35 ఏళ్ల కోహ్లికి అన్నిఫార్మాట్లలో ప్రత్యామ్నాయ ప్లేయర్లను వెతికే పనిని బీసీసీఐ ఇప్పటికే నిమగ్నమైంది. ఇలాంటి తరుణంలో కోహ్లి జట్టుకు దూరమవ్వడం తన కెరీర్ పరంగానూ ఇబ్బందేనని పలువురు భావిస్తున్నారు.