T20, World Cup : వరల్డ్ కప్ లో మెరిసేది వాళ్లిద్దరే పాంటింగ్ జోస్యం

టీ ట్వంటీ (T20) వరల్డ్ కప్ (World Cup) మొదలవ్వడానికి ఇంకా కొద్ది గంటలే మిగిలింది. ఈ మెగా టోర్నీ (Mega Tournament) పై ఎవరి అంచనాలు వాళ్లకు ఉన్నాయి. వరల్డ్ కప్ లో సత్తా చాటెందుకు స్టార్ ప్లేయర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 31, 2024 | 06:20 PMLast Updated on: May 31, 2024 | 6:20 PM

What Shines In The World Cup Is The Prophecy Of Both Of Them Ponting

 

 

 

టీ ట్వంటీ (T20) వరల్డ్ కప్ (World Cup) మొదలవ్వడానికి ఇంకా కొద్ది గంటలే మిగిలింది. ఈ మెగా టోర్నీ (Mega Tournament) పై ఎవరి అంచనాలు వాళ్లకు ఉన్నాయి. వరల్డ్ కప్ లో సత్తా చాటెందుకు స్టార్ ప్లేయర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఐపీఎల్ (IPL) లో రాణించిన బుమ్రా, ట్రావిస్ హెడ్ లే ఈసారి టీ20 వరల్డ్ కప్ లో రాణిస్తారని పాంటింగ్ అంచనా వేశాడు. ఈ టోర్నీలో టాప్ పర్ఫార్మర్ల గురించి అతడు మాట్లాడాడు. ఈ మధ్యే ముగిసిన ఐపీఎల్లో బుమ్రా 20 వికెట్లతో రాణించాడు. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) చివరి స్థానంలో నిలిచినా.. ఆ జట్టులో బుమ్రా ఒక్కడే నిలకడగా రాణించాడు. దీంతో రాబోయే వరల్డ్ కప్ లో టీమిండియా అతనిపై భారీ ఆశలే పెట్టుకుంది.

టోర్నమెంట్లో తన అభిప్రాయం ప్రకారం అత్యధిక వికెట్లు తీసేది బుమ్రానే అన్నాడు. చాలా ఏళ్లుగా అతడు అద్భుతంగా రాణిస్తున్నాడన్నాడు. ఐపీఎల్లో కళ్లు చెదిరే రీతిలో బౌలింగ్ చేసాడని, కొత్త బంతితో అతడు స్వింగ్ చేయగలడని అభిప్రాయ పడ్డాడు. టీ20 క్రికెట్ (T20 Cricket) లో పరుగులు తక్కువగా ఇచ్చే ఓవర్లు వేస్తే వాటితోపాటే వికెట్లు కూడా వస్తాయన్నాడు. ఇక ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ కూడా అదరగొడతాడని పాంటింగ్ చెప్పాడు.
ఐపీఎల్ లో హెడ్ 15 మ్యాచ్ లలో ఏకంగా 567 రన్స్ చేశాడు. ఒక సెంచరీ కూడా ఉంది.టాప్ ఫామ్ లో ఉన్న హెడ్ కూడా తమకు ప్లస్ అవుతాడని ఆస్ట్రేలియా భావిస్తోంది.