ICC ODI WORLD CUP: సెమీఫైనల్‌లో వర్షం పడితే..? ఫైనల్‌కు వెళ్లే జట్టు ఏది..?

బుధవారం జరిగే తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడనుండగా, గురువారం జరిగే రెండో సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. భారత్ ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 12, 2023 | 06:01 PMLast Updated on: Nov 12, 2023 | 6:01 PM

What Will Happen If Indias Semi Final Is Washed Out By Rain In Odi World Cup

ICC ODI WORLD CUP: వన్డే ప్రపంచకప్ 2023 లో భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇప్పటికే సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాయి. దీంతో సెమీఫైనల్‌లో ఏ జట్టు ఏ జట్టుతో తలపడుతుందనే దానిపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. బుధవారం జరిగే తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడనుండగా, గురువారం జరిగే రెండో సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. భారత్ ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

ROHIT SHARMA: ఓపెనర్‌గా 14 వేలకుపైగా రన్స్‌.. రోహిత్ శర్మ మరో రికార్డు

న్యూజిలాండ్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 గెలిచి చివరి జట్టుగా సెమీస్‌లోకి ప్రవేశించింది. ఈ కారణంగానే భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్‌లో తలపడటం దాదాపు ఖాయమైంది. అయితే ఇంతలో సెమీఫైనల్ మ్యాచ్ రోజు వర్షం కురిస్తే విజేతను ఎలా ఎంపిక చేస్తారన్న ప్రశ్న మొదలైంది. ముంబైలో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతున్నందున ఇక్కడ ఎప్పుడూ అకాల వర్షం ముప్పు పొంచి ఉంటుంది. అయితే, సెమీఫైనల్ మ్యాచ్‌ల కోసం ఐసీసీ ఇప్పటికే రిజర్వ్ డే ఉంచింది. అయితే, రిజర్వ్ రోజున మ్యాచ్ ముగియకపోతే విజేతను ఎలా ఎంపిక చేస్తారు? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

వర్షం కారణంగా రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ పూర్తికాని పరిస్థితి ఏర్పడితే అది భారత్‌కు మేలు చేస్తుంది. నిబంధనల ప్రకారం రిజర్వ్ డే నాటికి మ్యాచ్ పూర్తి కాకపోతే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టుకు ఫైనల్ ఆడే అవకాశం ఉంటుంది. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్.. మ్యాచ్ ఆడకుండానే నేరుగా ఫైనల్‌కు చేరుకోగలదు. మరోవైపు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. మ్యాచ్ జరిగే రోజు వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే రిజర్వ్ డే అంటే మరుసటి రోజు మ్యాచ్ పూర్తవుతుంది. కానీ, ఆ రోజు వర్షం కారణంగా మ్యాచ్ పూర్తికాకపోతే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. ప్రస్తుత పాయింట్ల పట్టిక ప్రకారం, దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియా కంటే ముందుంది. దక్షిణాఫ్రికా జట్టు విజేతగా నిలుస్తుంది.