మాకూ టైమ్ వస్తాది వరుసగా 5 టైటిల్స్ గెలుస్తాం
ఐపీఎల్ ఆరంభమై 17 ఏళ్ళు పూర్తయినా కొన్ని జట్లు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు.. ముఖ్యంగా ఎంతోమంది స్టార్ ప్లేయర్స్ జట్టులో ఉన్నా... ఎప్పటికప్పుడు కెప్టెన్లను మారుస్తున్నా టైటిల్ కల నెరవేరని జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి.

ఐపీఎల్ ఆరంభమై 17 ఏళ్ళు పూర్తయినా కొన్ని జట్లు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు.. ముఖ్యంగా ఎంతోమంది స్టార్ ప్లేయర్స్ జట్టులో ఉన్నా… ఎప్పటికప్పుడు కెప్టెన్లను మారుస్తున్నా టైటిల్ కల నెరవేరని జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి… కోహ్లీ, గేల్, డివీలియర్స్ వంటి హేమాహేమీలు ఉన్నప్పుడు కూడా ఆ జట్టు ఛాంపియన్ కాలేకపోయింది. ఎప్పటికప్పుడు ఈ సారి కప్పు మనదే అంటూ బరిలోకి దిగి వట్టి చేతులతో రావడం వారికి అలవాటుగా మారింది. ఈ సారి కొత్త కెప్టెన్ రజత్ పటిదార్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న ఆర్సీబీపై ఈ సారి భారీగానే అంచనాలున్నాయి.ఈ సారి ఆర్సీబీ టైటిల్ గెలిపించడమే తన లక్ష్యమని.. ఆ జట్టులో చేరిన కొత్త వికెట్ కీపర్ జితేష్ శర్మ సీజన్ కు ముందు ధీమా వ్యక్తం చేశాడు.
ఓ పాడ్‌కాస్ట్‌లో జితేశ్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్ ఐపీఎల్ గెలవాలనుకుంటున్నామనీ,. గెలిచి విరాట్ కోహ్లీకి అంకితమిస్తానంటూ చెప్పుకొచ్చాడు. ఆర్సీబీ జట్టుకు ఫినిషర్ బాధ్యతలను తీసుకునేందుకు రెడీగా ఉన్నట్టు చెప్పాడు. ఈ సీజన్ లో తాము 14 మ్యాచ్ ల్లో 11 మ్యాచ్ లు ఖచ్చితంగా గెలుస్తామంటూ కాన్ఫిడెంట్ గా చెప్పడం ఆశ్చర్యరుస్తోంది. ఒకవేళ తమటైం వచ్చి ఒక్కసారి ఆర్సీబీ టైటిల్ గెలిస్తే ఇక ఆగేది ఉండదంటూ జితేశ్ శర్మ వ్యాఖ్యానించాడు వరుసగా ఐదు సీజన్ లలో తామే టైటిల్స్ గెలుస్తామంటూ చెప్పాడు. కోహ్లీ ఎన్నో ఏళ్లు టైటిల్ కలను సాకారం చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. డుప్లెసిస్‌తో కూడా కాలేదు. ఇప్పుడు యువ కెప్టెన్ రజత్ పటిదార్‌పై ఆ భారం పడింది. అయితే ఆర్సీబీ కెప్టెన్ గా పటిదార్ మంచి ఆప్షన్ గా జితేశ్ శర్మ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ వద్దనడంతోనే రజత్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారన్నాడు. రజత్ ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. సారథిగా అతనికున్న అనుభవం కూడా తక్కువే. దేశవాళీలో మధ్యప్రదేశ్‌ను నడిపించిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌ను ఫైనల్‌కు చేర్చాడు. దీంతో ఐపీఎల్‌లో ఆర్సీబీని రజత్ ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే గత సీజన్‌లో బెంగళూరు ప్రదర్శనను ఎవరూ మర్చిపోలేరు. ఆరంభంలో ఆ జట్టు తేలిపోయింది. 8 మ్యాచ్‌ల్లో ఒక్క విజయమే నమోదు చేసి ఎలిమినేషన్ అంచున నిలిచింది. ఆ పరిస్థితుల్లో ఆర్సీబీ పుంజుకున్న తీరు అద్భుతం. వరుస విజయాలు నమోదు చేసి ప్లే ఆఫ్స్‌కు దూసుకొచ్చింది. అయితే, ఎలిమినేటర్‌లో రాజస్థాన్ చేతిలో ఓడిపోయింది. ఈ సీజన్‌ను బెంగళూరు ఓపెనింగ్ మ్యాచ్‌తోనే ఆరంభించనుంది. ఈ నెల 22న జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.