పెళ్ళెప్పుడు.. లవ్ మ్యారేజా… ? ఫ్యాన్స్ కు నితీశ్ రెడ్డి రిప్లై
ఇండియన్ క్రికెట్ లో ఇప్పుడు తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ఐపీఎల్ తో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన నితీశ్ ఆల్ రౌండర్ గా రాణిస్తున్నాడు.

ఇండియన్ క్రికెట్ లో ఇప్పుడు తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ఐపీఎల్ తో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన నితీశ్ ఆల్ రౌండర్ గా రాణిస్తున్నాడు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున గత సీజన్ లో దుమ్మురేపిన ఈ విశాఖ కుర్రాడు ఇప్పుడు 18వ సీజన్ లోనూ సత్తా చాటుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో హిట్టింగ్ చేసిన నితీశ్ రెడ్డి 30 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‍లో ఓ ఆసక్తికర విషయం జరిగింది. ఫీల్డింగ్ చేస్తున్న నితీశ్ కుమార్ రెడ్డిని పెళ్లి గురించి ఫ్యాన్స్ అడిగారు. రాజస్థాన్ బ్యాటింగ్ చేస్తుండగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్‍కు నిలబడ్డాడు.ఎస్ఆర్‌ఎహెచ్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి. ఇంతలో స్టాండ్స్ నుంచి కొందరు అభిమానులు మ్యారేజ్ ఎప్పుడు బ్రో అంటూ అరిచారు. అమ్మాయిలు సచ్చిపోతున్నారు అయ్యా అంటూ కామెంట్లు చేశారు. దీంతో నితీశ్ లోలోపల నవ్వుకున్నట్టు కనిపించాడు.
బ్రో లవ్ మ్యారేజా అని మళ్లీ గట్టిగా అరుస్తూ నితీశ్ కుమార్ రెడ్డిని అడిగారు ఫ్యాన్స్. దీనికి నితీశ్ రియాక్ట్ అయ్యాడు. కాదు అనేలా తలను అడ్డంగా ఊపారు. అది చూసిన అభిమానులు గట్టిగా కేకలు వేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తంగా మైదానంలోనే పెళ్లి గురించి అభిమానులు అడిగేశారు. నితీశ్ కెరీర్ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. ఐపీఎల్ తో టీమిండియా టీ ట్వంటీ జట్టులోకి… కొన్ని రోజులకే టెస్ట్ జట్టులోకి సైతం ఎంట్రీ ఇచ్చాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కీలక బ్యాటర్లు విఫలమైన చోట మెల్ బోర్న్ వేదికగా సెంచరీ కొట్టాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెల్ బోర్న్ శతకం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డి.. తొలి సిరీస్‌లోనే అద్భుత ప్రదర్శన కనబర్చాడు. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో 171 బంతుల్లో తొలి సెంచరీ సాధించాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి నితీష్ మూడెంకల స్కోర్ అందుకున్నాడు. తన ఫేవరేట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బహుమతిగా ఇచ్చిన షూ వేసుకొనే మెల్‌బోర్న్ టెస్ట్‌లో సెంచరీ సాధించానని నితీష్ చెప్పాడు. మెల్ బోర్న్ టెస్ట్‌లో సెంచరీ చేసిన వెంటనే తన తండ్రి ముత్యాల రెడ్డి కోసం వెతికాననీ గుర్తు చేసుకున్నాడు. 80 వేల మంది ప్రేక్షకుల మధ్య ఆయనను గుర్తించలేకపోయాను. కానీ తర్వాత బిగ్ స్క్రీన్‌పై ఆనందభాష్పాలతో కనిపించిన నాన్నను చూసి భావోద్వేగానికి గురయ్యానంటూ సంతోషంగా చెప్పాడు. అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో అందరూ వచ్చి నన్ను అభినందించారనీ, . కోహ్లీ కూడా వచ్చి బాగా ఆడావ్ అని మెచ్చుకున్నాడనీ గుర్తు చేసుకున్నాడు. కోహ్లీ మెచ్చుకున్న ఆ క్షణాలు తనకు ఎంతో ప్రత్యేకమైనవిగా నితీష్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు.