India Vs West Indies: బలంలేని విండీస్ కొత్త కుర్రాళ్లకు పండగే

టీమ్‌ఇండియాతో రెండు టెస్టుల సిరీస్‌కు క్రికెట్‌ వెస్టిండీస్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసింది. ఇందుకోసం 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. ఎప్పట్లాగే క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ సారథ్యం వహించనున్నాడు. అయితే సుదీర్ఘ ఫార్మాట్‌కు కరీబియన్‌ స్టార్‌ ప్లేయర్స్‌ అందుబాటులో ఉండటం సందిగ్ధంగా మారింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 1, 2023 | 03:28 PMLast Updated on: Jul 01, 2023 | 3:28 PM

While West Indies Senior Players Are Playing World Cup Eligibility Matches West Indies Matches Will Be Played With Junior Players

ప్రస్తుతం వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తోంది. హరారేలో ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ అర్హత టోర్నీ ఆడుతోంది. దాంతో జులై 9 వరకు అక్కడే ఉండాల్సి వస్తోంది. జులై 7న చివరి సూపర్‌ 6 మ్యాచ్‌ ఆడుతుంది. పాయింట్లను బట్టి జులై 9న ఫైనల్‌కు చేరుకోవచ్చు. అప్పటి వరకు కరీబియన్‌ దీవులకు వచ్చే ప్రసక్తే లేదు. ఒకవేళ ఫైనల్‌ ఆడకపోతే ముందుగా రావొచ్చు. భారత్‌, వెస్టిండీస్‌ సుదీర్ఘ ఫార్మాట్‌ జులై 12న మొదలవుతుంది. డొమినికా ఇందుకు వేదిక.

జులై 20న ట్రినిడాడ్‌లోని క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌లో రెండో టెస్టు ఆరంభమవుతుంది. అయితే క్రికెట్‌ వెస్టిండీస్‌ ఏర్పాటు చేసిన సన్నాహక జట్టు జులై 8 వరకు ఆంటిగ్వాలోనే ఉంటుంది. అక్కడే సాధన చేస్తుంది. టెస్టు సిరీసుతో పోలిస్తే వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించడమే విండీస్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే జేసన్‌ హోల్డర్‌, నికోలస్‌ పూరన్‌, రోస్టన్ ఛేజ్, కైల్‌ మేయర్స్‌, అల్జారీ జోసెఫ్‌ వంటి స్టార్లు అక్కడే ఉన్నారు.

వారిలో కొందరు నేరుగా తొలి టెస్టు రావొచ్చని సమాచారం. టీమ్‌ఇండియా వారం రోజుల క్రితమే టెస్టు, వన్డే జట్లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. సీనియర్‌ ఆటగాడు చెతేశ్వర్‌ పుజారాకు చోటు దక్కలేదు. అజింక్య రహానెకు వైస్‌ కెప్టెన్సీ దక్కింది. రుతురాజ్‌ గైక్వాడ్‌, యశస్వీ జైశ్వాల్‌, ముకేశ్ కుమార్‌ వంటి కుర్రాళ్లకు చోటు దక్కింది. అంత గొప్పగా లేని విండీస్ జట్టు మీద, ఇండియా నుంచి డెబ్యూ చేస్తున్న ఆటగాళ్లు, మెమొరబుల్ అఛీవ్మెంట్స్ పొందవచ్చు అని, క్రికెట్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.