ఆ రెండే మిగిలాయి పంజాబ్,కేకేఆర్ కెప్టెన్లు ఎవరో ?

ఐపీఎల్ 18వ సీజన్ మార్చి చివరి వారంలో ఆరంభం కానుంది. అధికారికంగా షెడ్యూల్ విడుదల కాకున్నా బోర్డు వర్గాల సమాచారం ప్రకారం మార్చి 22 నుంచి మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 15, 2025 | 04:20 PMLast Updated on: Feb 15, 2025 | 4:20 PM

Who Are The Captains Of Punjab And Kkr

ఐపీఎల్ 18వ సీజన్ మార్చి చివరి వారంలో ఆరంభం కానుంది. అధికారికంగా షెడ్యూల్ విడుదల కాకున్నా బోర్డు వర్గాల సమాచారం ప్రకారం మార్చి 22 నుంచి మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 12 వేదికల్లో 18వ సీజన్ మ్యాచ్ లు జరగనుండగా.. ఇప్పటికే ఫ్రాంచైజీలన్నీ తమ ప్రిపరేషన్ లో బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో తమ జట్టు కూర్పుపైనా దృష్టి పెట్టిన ఫ్రాంచైజీలు కెప్టెన్లను కూడా ఖరారు చేసుకుంటున్నాయి. కొన్ని జట్లకు పాత కెప్టెన్లే ఉండగా.. మరికొన్నింటికి మాత్రం కొత్త సారథులు రాబోతున్నారు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చేశాడు. ఆ ఫ్రాంచైజీ రజత్ పాటిదార్ ను సారథిగా ఎంపిక చేసింది. సీనియర్ ప్లేయర్స్ చాలా మందే ఉన్న ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని రజత్ కు పగ్గాలు అప్పగించింది. దీంతో ఐపీఎల్ లో పాల్గొనబోయే 10 జట్లలో 8 జట్ల కెప్టెన్లపై ఓ క్లారిటీ వచ్చింది. కానీ ఆ రెండు జట్ల సారథులు ఎవరన్నది ఇప్పటికీ స్పష్టత రాలేదు.

ఈ రెండు జట్లలో ఒకటి డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కత్తా నైట్ రైడర్స్… గత సీజన్ లో ఆ జట్టును ఛాంపియన్ గా నిలిపిన శ్రేయాస్ అయ్యర్ ను కేకేఆర్ మెగావేలానికి ముందే రిలీజ్ చేసింది. వేలంలోనూ అతని కోసం ట్రై చేయలేదు. మెగా ఆక్షన్ లో పలువురు స్టార్ క్రికెటర్లను కోల్ కత్తా సొంతం చేసుకుంది. అలాగే రసెల్, నరైన్‌ లాంటి సీనియర్లు కూడా ఉన్నారు. కానీ వాళ్లకు కెప్టెన్ బాధ్యతలు అప్పగించే అవకాశం లేదు. 23 కోట్లు ఖర్చు పెట్టి జట్టులోకి తీసుకున్న వెంకటేశ్ అయ్యర్‌ కు కెప్టెన్సీ అనుభవం లేదు. ఇప్పుడు ఆ జట్టుకు ఉన్న ఏకైన ఆప్షన్ అజింక్య రహానే మాత్రమే. నిజానికి కేకేఆర్ కు రహానేను తీసుకోవాలన్న ఆలోచన లేదు. కెప్టెన్సీని దృష్టిలో ఉంచుకునే అతడిని కొనుగోలు చేసినట్టు భావిస్తున్నారు. అజింక్య రహానే 2008 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 185 మ్యాచ్‌లు ఆడాడు.

మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఎవరికి పగ్గాలు అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రిషబ్ పంత్ ను వేలంలో వదిలేసిన ఢిల్లీ ఫ్రాంచైజీ కేఎల్ రాహుల్ కొనుగోలు చేయడంతో అతనికే కెప్టెన్సీ ఇస్తారని భావించారు. కానీ అనూహ్యంగా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కూడా రేసులోకి వచ్చాడు. పైగా యాజమాన్యం కూడా అతనివైపే మొగ్గుచూపుతోంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ సహ-యజమాని పార్త్ జిందాల్ అక్షర్ కు సారథ్య బాధ్యతలు అప్పగించడంపై హింట్ కూడా ఇచ్చారు. ఈ స్టార్ ఆల్ రౌండర్ గత సీజన్‌లో వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడని ఆయన గుర్తు చేశారు.
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్‌ను 16.50 కోట్లకు తన వద్ద ఉంచుకుంది. ప్రస్తుతానికి కోల్ కత్తా, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు తమ కెప్టెన్లను ప్రకటించాల్సి ఉంది. కాగా వచ్చే సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు రుతురాజ్‌ గైక్వాడ్, ముంబయి ఇండియన్స్ కు హార్దిక్‌ పాండ్య, గుజరాత్‌ టైటాన్స్ కు శుభమన్ గిల్, సన్ రైజర్స్ హైదరాబాద్‌కు పాట్ కమిన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కు రిషభ్‌ పంత్, పంజాబ్ కింగ్స్‌కు శ్రేయస్‌ అయ్యర్, రాజస్థాన్‌ రాయల్స్ కు సంజు శాంసన్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.