కోల్ కతా మెంటార్ గా ఎవరో ? రేసులో కల్లిస్, పాంటింగ్, సంగక్కర

వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఫ్రాంచైజీలు తమ సపోర్ట్ స్టాఫ్ లోనూ పలు మార్పులు చేస్తున్నాయి. కోల్ కత్తా నైట్ రైడర్స్ కు మెంటార్ గా ఉన్న గౌతమ్ గంభీర్ టీమిండియా కోచ్ గా వెళ్ళిపోవడంతో ప్రస్తుతం ఆ ప్లేస్ ను భర్తీ చేసేందుకు రెడీ అయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 10, 2024 | 04:34 PMLast Updated on: Sep 10, 2024 | 4:34 PM

Who Is Kolkata Mentor

వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఫ్రాంచైజీలు తమ సపోర్ట్ స్టాఫ్ లోనూ పలు మార్పులు చేస్తున్నాయి. కోల్ కత్తా నైట్ రైడర్స్ కు మెంటార్ గా ఉన్న గౌతమ్ గంభీర్ టీమిండియా కోచ్ గా వెళ్ళిపోవడంతో ప్రస్తుతం ఆ ప్లేస్ ను భర్తీ చేసేందుకు రెడీ అయింది. ప్రస్తుతం కోల్ కతా మెంటార్ గా బాధ్యతల కోసం ముగ్గురు రేసులో ఉన్నారు. సఫారీ దిగ్గజం జాక్ కల్లస్ , ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తో పాటు లంక దిగ్గజం కుమార సంగక్కరా పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో కోల్ కతా జట్టుకు ఆడడమే కాకుండా కోచ్ గా వ్యవహరించిన జాక్ కల్లిస్ ఈ రేసులో ముందున్నట్టు సమాచారం. దాదాపు అతన్ని మెంటార్ తీసుకోవడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. కల్లిస్ తో కోల్ కతా ఫ్రాంచైజీ యాజమాన్యానికి మంచి సంబంధాలు ఉండడం మరో కారణంగా చెప్పొచ్చు.

అలాగే ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తోనూ కోల్ కతా సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. గత సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ గా వ్యవహరించిన పాంటింగ్ కు ఆ ఫ్రాంచైజీ గుడ్ బై చెప్పేసింది. ఇక లంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర పేరు కూడా వినిపిస్తోంది. సంగక్కరా ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. రాజస్తాన్ కొత్త కోచ్ గా ద్రావిడ్ ను నియమించడంతో సంగక్కరా కొనసాగడం అనుమానంగానే ఉన్న వేళ కోల్ కతాతో టచ్ లో ఉన్నట్టు సమాచారం. మొత్తం మీద రేసులో ముందున్న కల్లిస్ కే నైట్ రైడర్స్ మెంటార్ బాధ్యతలు దక్కే ఛాన్సుంది.