కోహ్లీని ఔట్ చేసిన టికెట్ కలెక్టర్ ఎవరీ హిమాన్షు సంఘ్వాన్ ?
నిన్నటి వరకూ ఆ పేస్ బౌలర్ గురించి ఎవ్వరికీ తెలీదు.. కానీ ఒక్క వికెట్ తో ఇప్పుడు అతని పేరు మారుమోగిపోతోంది... అతనెవరో కాదు ఢిల్లీతో రంజీ మ్యాచ్ లో రైల్వేస్ తరపున ఆడుతున్న హిమాన్షు సంఘ్వాన్...
నిన్నటి వరకూ ఆ పేస్ బౌలర్ గురించి ఎవ్వరికీ తెలీదు.. కానీ ఒక్క వికెట్ తో ఇప్పుడు అతని పేరు మారుమోగిపోతోంది… అతనెవరో కాదు ఢిల్లీతో రంజీ మ్యాచ్ లో రైల్వేస్ తరపున ఆడుతున్న హిమాన్షు సంఘ్వాన్… ఈ మ్యాచ్ లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వికెట్ తీసిన సంఘ్వాన్ ఇప్పుడు ఒక్కసారిగా అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రంజీ ట్రోఫీ బరిలోకి దిగిన విరాట్ కోహ్లీకి ఈ యువ పేసర్ ఊహించని షాకిచ్చాడు. స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేసి కింగ్ కోహ్లీకి ఓ చేదు జ్ఞాపకాన్ని మిగిల్చాడు. దాంతో ఈ యువ పేసర్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాడు.
తొలిరోజు ఫీల్డింగ్ కే పరిమితమైన కోహ్లీ రెండోరోజు బ్యాటింగ్ లో నాలుగో స్థానంలో క్రీజులోకి వచ్చాడు. భారీగా ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ ను నిరాశపరుస్తూ 6 పరుగులకే ఔటయ్యాడు. హిమాన్షు సంగ్వాన్ వేసిన ఇన్‌స్వింగర్‌ను కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేసిన కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ డెలివరీకి కోహ్లీనే కాదు స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ అందరూ స్టన్ అయ్యారు. వరల్డ్ బెస్ట్ బ్యాటర్ అయిన విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేయడంతో హిమాన్షు సాంగ్వాన్ పేరు మారుమోగుతోంది. అతను ఎవరా అంటూ నెటిజన్లు గూగుల్ లో వెతికేస్తున్నారు.
ఢిల్లీకే చెందిన హిమాన్షు సాంగ్వాన్ దేశవాళీ క్రికెట్‌లో రైల్వేస్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గత 6 ఏళ్లుగా ఆ జట్టుకు ఆడుతున్నప్పటికీ చాలా తక్కువ మ్యాచ్‌ల్లో అవకాశాలు అందుకున్నాడు. ఇప్పటి వరకు 23 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన హిమాన్షు సాంగ్వాన్.. 40 ఇన్నింగ్స్‌ల్లో 77 వికెట్లు పడగొట్టాడు. అ17 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీసాడు. దేశవాళీ టీ20ల్లో ఐదు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే హిమాన్షు సంఘ్వాన్ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో టికెట్ కలెక్టర్‌గా జాబ్ చేస్తున్నాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లు తీయడం ద్వారా హిమాన్షు తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ వికెట్ తీసి మరోసారి ట్రెండింగ్ లో నిలిచాడు.