ఐపీఎల్ సిక్సర్ల కింగ్ అతడే గేల్ రికార్డును బ్రేక్ చేసేదెవరో ?
టీ ట్వంటీ ఫార్మాట్ అంటేనే బ్యాటర్ల హవా... ఇక ఐపీఎల్ లాంటి లీగ్ లో అయితే ఫ్యాన్స్ ఎదురుచూసేది సిక్సర్లు, బౌండరీల కోసమే... ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి ప్రతీ సీజన్ లోనూ బ్యాటర్ల మెరుపులు ఫ్యాన్స్ కు కిక్కు ఇస్తూనే ఉన్నాయి

టీ ట్వంటీ ఫార్మాట్ అంటేనే బ్యాటర్ల హవా… ఇక ఐపీఎల్ లాంటి లీగ్ లో అయితే ఫ్యాన్స్ ఎదురుచూసేది సిక్సర్లు, బౌండరీల కోసమే… ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి ప్రతీ సీజన్ లోనూ బ్యాటర్ల మెరుపులు ఫ్యాన్స్ కు కిక్కు ఇస్తూనే ఉన్నాయి. ఈ మెగా లీగ్ లో సిక్సర్ల కింగ్ ఎవరనేది చూస్తే కరేబియన్ వీరుడు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరు చెప్పాల్సిందే… ఎందుకంటే ఐపీఎల్ లో అత్యధిక సిక్సర్లు బాదింది ఈ విండీస్ హిట్టరే…ప్రస్తుతం గేల్ రిటైరయినప్పటకీ అతని రికార్డు మాత్రం పదిలంగానే ఉంది. ఇప్పటివరకు క్రిస్ గేల్ 141 మ్యాచులు ఆడగా… ఇందులో 357 సిక్సర్లు కొట్టాడు. ఇక క్రిస్ గేల్ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. ఇప్పటివరకు 252 ఇన్నింగ్స్ లు ఆడిన రోహిత్ శర్మ…. 280 సిక్సులు కొట్టాడు. దీంతో… సిక్స్ ల లిస్టులో రెండవ స్థానాన్ని దక్కించుకున్నాడు రోహిత్ శర్మ. ఆ తర్వాత విరాట్ కోహ్లీ మూడవ స్థానాన్ని దక్కించుకున్నాడు. 244 ఇన్నింగ్స్ లలో ఇప్పటివరకు విరాట్ కోహ్లీ 272 సిక్సులు కొట్టాడు. ఇక విరాట్ కోహ్లీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని నిలిచాడు. ఇప్పటివరకు 229 ఇన్నింగ్స్ లాడిన మహేంద్ర సింగ్ ధోని 252 సిక్సులు బాదాడు. మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత… దక్షిణాఫ్రికా ఆటగాడు ఎబి డివిలియర్స్ ఉన్నాడు.
ఇప్పటి వరకు 170 ఇన్నింగ్స్ ఆడిన ఎబి డివిలియర్స్ 251 సిక్సులు కొట్టాడు. ఇక దక్షిణాఫ్రికా ఆటగాడు ఎబి డివిలియర్స్… తర్వాత… ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు. ఇప్పటివరకు.. 184 మ్యాచ్ లాడిన డేవిడ్ వార్నర్ 236 సిక్సులు కొట్టాడు. ఈ టాప్ ప్లేయర్లలో ముగ్గురు కూడా ఇప్పుడు ఐపీఎల్ ఆడటం లేదు. క్రిస్ గేల్ అలాగే ఎబి డివిలియర్స్ ఇద్దరు కూడా ఐపీఎల్ కు దూరంగా ఉంటున్నారు. కానీ డేవిడ్ వార్నర్ ను మొన్న వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. కాబట్టి ఈ ముగ్గురిని పక్కకు పెడితే మిగిలిన… టీమిండియా ప్లేయర్లు క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టే అవకాశాలు ఉంటాయి. ఇందులో ఎక్కువగా రోహిత్ శర్మకు ఈ అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరో నాలుగు సీజన్ల వరకు హిట్ మ్యాన్ ఖచ్చితంగా ఐపీఎల్ ఆడే ఛాన్స్ ఉంటుంది. రెండవ స్థానంలో ఉన్న… రోహిత్ శర్మ సులభంగా క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొడతాడని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన రికార్డు టీమ్ఇండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ పేరిట ఉంది. ధావన్ 222 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 768 ఫోర్లు కొట్టాడు. ధావన్ ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదారాబాద్ తరుపున ఆడాడు. ధావన్ ఇప్పటికే ఆటకు వీడ్కోలు చెప్పేశాడు. అటు టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ 252 మ్యాచ్‌ల్లో 705 ఫోర్లు కొట్టాడు. వీరిద్దరి తరువాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ, సురేశ్ రైనా, గౌతమ్ గంభీర్‌లు ఉన్నారు. ఫ్యూచర్ లో ఐపీఎల్ కు సంబంధించి అత్యధిక ఫోర్ల రికార్డును కోహ్లీ, సిక్సర్ల రికార్డును రోహిత్ బ్రేక్ చేసే ఛాన్సుంది.