MS DHONI: ధోనీ తర్వాత చెన్నై కెప్టెన్ ఎవరు..? క్లారిటీ ఇచ్చిన సీఎస్కే సీఈవో

2022 సీజన్లో కొన్ని మ్యాచ్‌లకు జడేజాను కెప్టెన్‌ను చేసినా.. అతడు విఫలం కావడంతో మళ్లీ ధోనీనే కెప్టెన్‌ను చేశారు. చెన్నై సూపర్ కింగ్స్.. ధోనీ కెప్టెన్సీలో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. మరి అతని తర్వాత చెన్నై కెప్టెన్ ఎవరు అవుతారు..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 12, 2024 | 07:52 PMLast Updated on: Mar 12, 2024 | 7:52 PM

Who Will Replace Ms Dhoni As Csk Captain Franchise Ceo Viswanathan Admits To Internal Talks

MS DHONI: ఐపీఎల్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుండగా.. చెన్నై సూపర్ కింగ్స్‌ను మరోసారి ధోనీ లీడ్ చేయనున్నాడు. సారథిగా మహికి ఇదే చివరిసారి కూడా కావచ్చు. ఈ నేపథ్యంలో ధోనీలాంటి కెప్టెన్‌కు ప్రత్యామ్నాయం చూడటం సీఎస్కే ఫ్రాంఛైజీకి అంత సులువు కాదు. 2022 సీజన్లో కొన్ని మ్యాచ్‌లకు జడేజాను కెప్టెన్‌ను చేసినా.. అతడు విఫలం కావడంతో మళ్లీ ధోనీనే కెప్టెన్‌ను చేశారు. చెన్నై సూపర్ కింగ్స్.. ధోనీ కెప్టెన్సీలో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది.

Geethanjali: టీడీపీ 5 ప్రశ్నలు.. తెనాలి స్టేషన్‌లో ఆమెతో ఉన్నది ఎవరు.. గీతాంజలి ఘటనపై అనుమానాలు..

మరి అతని తర్వాత చెన్నై కెప్టెన్ ఎవరు అవుతారన్న ప్రశ్నకు సమాధానం ఏంటన్నది తెలియడం లేదు. తాజాగా దీనిపై స్పందించిన చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్.. ఆ విషయం కోచ్, కెప్టెన్‌కే వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. దీనిపై అంతర్గతంగా చర్చలు నడుస్తున్నాయన్నారు. కెప్టెన్, వైస్ కెప్టెన్ నియామకాల గురించి మనం మాట్లాడకూడదని శ్రీనివాసన్ స్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

కెప్టెన్, కోచ్ నిర్ణయించి.. వాళ్లు ఆ విషయాన్ని తనకి చెబితే అందరితో పంచుకుంటానని తెలిపారు. కెప్టెన్, కోచ్ నిర్ణయం తీసుకునే వరకూ ఈ విషయంపై అందరూ మౌనంగా ఉండాలని కాశీ విశ్వనాథన్ సూచించారు. మరోవైపు ఐపీఎల్ 2024 సీజన్ కోసం మార్చి తొలి వారంలోనే చెన్నైలో అడుగుపెట్టిన కెప్టెన్ ధోనీ ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్నాడు.