విన్నర్స్ కు వైట్ జాకెట్స్ వాటిని ఎందుకిస్తారంటే ?

ఛాంపియన్స్ ట్రోఫీలో దుమ్మురేపిన టీమిండియా అంచనాలకు తగ్గట్టే రాణించి ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్ ను నిలువరించి మూడోసారి టైటిల్ గెలుచుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 11, 2025 | 03:20 PMLast Updated on: Mar 11, 2025 | 3:20 PM

Why Do They Give White Jackets To Winners

ఛాంపియన్స్ ట్రోఫీలో దుమ్మురేపిన టీమిండియా అంచనాలకు తగ్గట్టే రాణించి ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్ ను నిలువరించి మూడోసారి టైటిల్ గెలుచుకుంది. నలుగురు స్పిన్నర్ల వ్యూహం, కీలక బ్యాటర్లు రాణించడం ద్వారా కాస్త తడబడినా టైటిల్ పోరులో పైచేయి సాధించింది. విజేతగా నిలిచిన భారత్ కు ట్రోపీ సందర్భంగా భారత ఆటగాళ్లందరికి వైట్ జాకెట్స్ ప్రధానం చేశారు. ఆ వైట్ జాకెట్స్ ధరించిన తర్వాతే భారత ఆటగాళ్లు టైటిల్ స్వీకరించారు. అయితే ఈ వైట్ జాకెట్స్ ఎందుకు ప్రధానం చేశారు? వాటిని ఆటగాళ్లంతా ఎందుకు ధరించారనే ప్రశ్నలు అభిమానులను వెంటాడుతున్నాయి. వైట్ జాకెట్ వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసుకుందాం.

1998లో బంగ్లాదేశ్‌లో ఈ టోర్నీకి శ్రీకారం చుట్టారు. అప్పట్లో నాకౌట్‌ టోర్నీగా మొదలైన ఈ ఈవెంట్‌ను మినీ ప్రపంచకప్‌గా అభివర్ణించేవారు. ఇక వైట్‌ జాకెట్ల హంగు, వేదికపై ఆర్భాటం మాత్రం 2009లో మొదలైంది. ముంబైకి చెందిన ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ బబితా ఈ వైట్‌ జాకెట్ల రూపకర్త. మనకిది సాధారణ వైట్‌ సూట్‌లాగే కనిపిస్తుంది. కానీ ఇది ఎంతో ప్రత్యేకమైన ఇటాలియన్‌ వూల్‌తో తయారైంది. ఈ వైట్ జాకెట్ వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఐసీసీ తమ ప్రకటనలో తెలియజేసింది. తెల్లటి జాకెట్ విజేతలకు అందించే గౌరవ చిహ్నం. ఇది ఆటగాళ్ల ప్రతిభతో పాటు నిరంత కృషిని ప్రతిబింబిస్తూ భవిష్యత్తు తరాలకు స్పూర్తిగా నిలుస్తోంది. వైట్ జాకెట్ గెలవడం అనేది విజయం కోసం అన్ని విధాల పోరాడాలనే విషయాన్ని సూచిస్తుంది.

ఈ జాకెట్‌ తెల్లటి రంగులో గోల్డెన్ బ్రైడింగ్‌తో రూపొందిచారు. ఆకర్షణీయంగా కనిపించేలా డిజైన్ చేశారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన లోగోకు గోల్డెన్ కలర్‌తో పాటు ఫ్యాబ్రిక్ రంగుతో ఎంబ్రాయిడరీ చేశారు. అత్యంత ఖరీదైన ఇటాలియన్ నూలుతో ఈ జాకెట్‌ను డిజైన్ చేశారు. ఈ వైట్ జాకెట్స్‌ను బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ ప్రధానం చేయగా.. వరుణ్ చక్రవర్తీ ముందుగా ఈ వైట్ జాకెట్‌ను అందుకున్నాడు. రోజర్ బిన్నీ స్వయంగా ఆటగాళ్లందరికీ ఈ జాకెట్స్‌ను తొడిగారు.